● పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలి
● ఎల్లారెడ్డి రైతు ధర్నాలో
మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డి: యూరియా యాప్ పేరుతో రైతులను ఇ బ్బందులకు గురిచేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పేర్కొన్నారు. యూరియా యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎల్లారెడ్డిలోని తహసీల్ కార్యాలయం ఎదుట రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను టెక్నాలజీ పేరు తో ఇబ్బందుల పాలు చేయడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. స్మార్ట్‌ఫోన్లు లేని నిరక్షరాస్యులైన రై తులు యూరియా బుక్ చేసుకోలేకపోతున్నారన్నారు. ఆధార్ కార్డు లేదా పట్టాదారు పాస్ పుస్తకం చూపిస్తే నేరుగా యూరియా ఇచ్చే పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి రెండు రోజులలో అని సెంటర్‌లలో యూరియా అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ప్రేమ్‌కుమార్ హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల బీఆర్‌ఎస్ నేతలు కపిల్‌రెడ్డి, తానాజీరావు, శ్రీనివాస్‌రెడ్డి, ముదాం సాయిలు, జలంధర్‌రెడ్డి, సతీష్, నర్సింలు, మనోహర్‌రెడ్డి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.


