కామారెడ్డి క్రైం: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం కామారెడ్డి పట్టణ శివారులోని నర్సనపల్లి వద్ద అటవీ శాఖ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ టిబ్రెవాల్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, ఏఎస్పీ నరసింహారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.


