కామారెడ్డి అర్బన్: శాస్త్రసాంకేతిక యుగానికి విద్యార్థులను భావి ప్రపంచానికి సిద్ధం చేసే లక్ష్యంతో తెలంగాణ విద్యాశాఖ ‘అన్న–అక్క’ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం ప్రారంభించిందని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నోడల్ అధికారి ఎ. రాజేందర్ అన్నారు. డిగ్రీ చివరి సంవత్సరం చదివే విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ అంశాలపై గురువారం ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అన్న–అక్క ఇంటర్న్‌షిప్‌లో భాగంగా 30 గంటల శిక్షణ అందిస్తామని నోడల్ అధికారి పేర్కొన్నారు. ప్రిన్సిపల్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యార్థుల్లో సమాజంపై బాధ్యత పెంచుతుందన్నారు.సమన్వయకర్తలు విశ్వప్రసాద్, సుధాకర్, శ్రీనివాస్‌రావు, రాములు, కవిత, రాంప్రసాద్‌తో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి కళాశాలల నోడల్ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


