మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక కృషి | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక కృషి

Jun 19 2026 1:06 AM | Updated on Jun 19 2026 1:06 AM

కల్లూర్‌ గ్రామంలో జిల్లాలోనే తొలి మహిళా మండలి భవనం నిర్మాణం

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి

రుద్రూర్‌ : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించి అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పోతంగల్‌ మండలం కల్లూరు గ్రామంలో రూ.10 లక్షల ఎన్‌న్‌ఆర్‌జీఎస్‌ నిధులతో నిర్మించిన గ్రామ మహిళా సంఘం భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ... జిల్లాలోనే తొలి మహిళా మండలి భవనం కల్లూర్‌ గ్రామంలో నిర్మించబడటం అభినందనీయమన్నారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని ఆకాంక్షించారు. బాన్సువాడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా విద్య, వైద్యం, సాగునీటి రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోధన్‌ ఆర్డీవో విజయకుమారి, సర్పంచ్‌ రామ్‌రెడ్డి, డీఆర్‌డీవో సాయన్న, తహసీల్దార్‌ సందీప్‌, ఎంపీడీవో చందర్‌, ఐకేపీ ఏపీఎం భాస్కర్‌, మాజీ ఎంపీపీ పుప్పాల శంకర్‌, ఏఎంసీ చైర్మన్‌ హనుమంతు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement