బాధితులకు సత్వర న్యాయం అందించాలి | - | Sakshi
Sakshi News home page

బాధితులకు సత్వర న్యాయం అందించాలి

Jun 19 2026 1:06 AM | Updated on Jun 19 2026 1:06 AM

కామారెడ్డి క్రైం: కామారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషనన్‌ను గురువారం ఎస్పీ రాజేశ్‌ చంద్ర ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్‌ పరిసరాలు, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు తదితర అంశాలను పరిశీలించారు. స్టేషన్‌ రికార్డులను తనిఖీ చేసి దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్‌ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. రోల్‌ కాల్‌ ప్రాముఖ్యతను సిబ్బందికి వివరించారు. ఠాణాలో సిబ్బంది విధులు, బాధ్యతలపై ఆరా తీశారు. ప్రతి కేసులోనూ బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని పక్కాగా అమలు చేయాలని సూచించారు. అన్ని రికార్డులను నిర్ణీత గడువులోగా సీసీటీఎన్‌ఎస్‌ పోర్టల్‌లో నమోదు చేసి, ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని ఎస్‌హెచ్‌వోను ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. అనుమానిత వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచాలని సూచించారు. పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement