కామారెడ్డి క్రైం: మైనర్ డ్రైవింగ్ నేరమని తెలిసినా తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పిల్లల విషయంలో అతి విశ్వాసంతో వాహనాలను అప్పగిస్తున్నారు. ఇది ప్రాణాల మీదికి తెస్తోంది. గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని ఇల్చిపూర్ శివారులో రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రి పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. తాడ్వాయి మండలం నందివాడకు చెందిన పుల్గం వెంకటస్వామి (39) ఎనిమిదేళ్ల క్రితం లింగంపేట మండలం మోతె గ్రామానికి చెందిన బొద్దుల పౌల్ ఇంటికి ఇల్లరికం వచ్చాడు. అతడికి భార్య స్వప్న, ఐదేళ్లలోపు వయసుగల కుమారు లు విస్తృత్, విహాల్ ఉన్నారు. అతడు కామారెడ్డిలోని ఓ ప్రై వేటు కంపెనీలో రికవరీ ఏ జెంట్‌గా పని చేస్తున్నాడు. రో జూ మాదిరిగానే గురువా రం ఇంటి నుంచి బైక్‌పై విధులకు వెళ్లాడు. ఇల్చిపూర్ శివారులో ఎదురుగా వచ్చిన రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్‌పై ప్ర యాణించిన జిల్లాకేంద్రంలోని అశోక్‌నగర్‌కు చెందిన బాలుడికి గాయాలయ్యాయి. అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
పదో తరగతి పాసయ్యాడని స్పోర్ట్స్ బైక్!
సదరు బాలుడు పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్‌లో అడుగుపెట్టాడు. కొడుకు పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడన్న సంబురంతో అతడి తండ్రి రూ. 4 లక్షలు విలువ చేసే స్పోర్ట్స్ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నామని ఎస్సై రంజిత్ తెలిపారు.


