భిక్కనూరు: నిరుపేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇండ్ల పథకం నెరవేర్చిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం రామేశ్వర్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పార్టీలకతీతంగా అర్హులందరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామన్నారు.గుడిసెలు లేని రాష్ట్రంగా త్వర లోనే తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుందన్నారు. రానున్న రోజుల్లో స్థలం లేని వారి కోసం కూడా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించేందుకు కసరత్తు చేస్తోందన్నారు. సర్పంచ్ చేపూరి రాణి, ఉపసర్పంచ్ వినోద్‌గౌడ్, వీడీసీ అధ్యక్షుడు సూర్యకాంత్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్యామ్, నేతలు నాగర్తి భూంరెడ్డి, శశికుమార్ రమేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
బీబీపేట: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పాత రాజు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తుదారు ఇంటి నిర్మాణానికి ముగ్గు పోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చి పేదల ప్రభుత్వంగా గుర్తింపు పొందిందన్నారు. ఉపసర్పంచ్ ప్రశాంత్, వార్డు సభ్యులు రోజా, కాంగ్రెస్ నాయకులు సుతారి రమేష్, మహేష్, స్వామి, అరుణ్ పాల్గొన్నారు.


