నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోలిలింగాల, చీనూర్ గ్రామాల్లో గల ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం టాస్క్‌ఫోర్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా కొనుగోలుకేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం కుప్పల గురించి స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో నేటికీ ధాన్యం కుప్పలు ఉండడంపై వారు కారణాలు తెలుసుకున్నారు. కొనుగోలుకేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించే తమను రైస్‌మిల్లర్లు నిలువునా దోచుకుంటున్నారని రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఒక్కో క్వింటాల్‌కు 5–6 కిలోలు అదనంగా తీసుకుంటున్నారని అధికారుల బృందం ఎదుట రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ శ్రీధర్‌రెడ్డి, అసిస్టెంట్ సివిల్‌సప్లయ్ అధికారి సుదర్శన్‌రెడ్డి, డీఎస్పీ శేఖర్‌రెడ్డి, ఎసైన్స శ్రీనివాస్‌రావు, ఏన్‌ఫోర్స్‌మెంట్ డీటీ సురేష్, ఏపీఎం రాంనారాయణగౌడ్, ఏవో సాయికిరణ్, సీసీలు నారాయణ, రమేశ్, నజీర్ తదితరులున్నారు.


