‘సర్‌’కు అన్ని పార్టీలు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’కు అన్ని పార్టీలు సహకరించాలి

Jun 18 2026 1:17 AM | Updated on Jun 18 2026 1:17 AM

మద్నూర్‌: ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు అన్ని రాజీకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఈఆర్‌వో, అదనపు కలెక్టర్‌ విక్టర్‌ కోరారు. బుధవారం మద్నూర్‌లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు బూత్‌ లెవల్‌ ఏజెంట్లను నియమించుకోవాలన్నారు. అర్హులైన ఓటర్ల నమోదు, అనర్హుల తొలగింపు, పేరు, చిరునామాల సవరణ వంటి అంశాల్లో బీఎల్‌వోలకు, ఈఆర్‌వో కార్యాలయానికి సహకారం అందించాలని కోరారు. ఎస్‌ఐఆర్‌ హెల్ప్‌డెస్క్‌ను ప్రారభించారు. కార్యక్రమంలో ఎనిమిది మండలాల తహసీల్దార్‌లు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement