మోపాల్ : మండలంలోని వడ్డెర కాలనీ గ్రామ పంచాయతీకి చెందిన వరి కుప్పల భీమారాజ్ (40) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై జాడె సుస్మిత బుధవారం తెలిపారు. భీమారాజ్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా కుటుంబ, వ్యక్తిగత కారణాలతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో 16న ఇంటి నుంచి వెళ్లిన భీమారాజ్ సిర్‌పూర్ తండా నుంచి సిర్‌పూర్ వెళ్లే మార్గంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి అదే రోజు అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నాగ్లూర్‌లో మరొకరు..
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని నాగ్లూర్ గ్రామానికి చెందిన బాలగోల్ల సుధాకర్‌రావు(35) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మహేందర్ బుధవారం తెలిపారు. ఈ నెల 15న సుధాకర్‌రావు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. సుధాకర్‌రావు గతంలో కూడా ఇంటి నుంచి వెళ్లి కొన్నిరోజులకు తిరిగి వచ్చేవాడని, అలానే వస్తాడని కుటుంబసభ్యులు భావించారు. గ్రామశివారులోని అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


