కామారెడ్డి టౌన్ : జిల్లా ఒలింపిక్ డే రన్–2026 చైర్మన్‌గా ఎం. జైపాల్‌రెడ్డి నియమితులయ్యారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయం మేరకు జిల్లా ఒలింపిక్ డే రన్ కమిటీని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ కన్వీనర్‌గా పి. అనిల్ కుమార్, సభ్యులుగా సందీప్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, సాయి మౌర్యలు నామినేట్ అయ్యారు. ఈ మేరకు నూతన కమిటీ బాధ్యులను పలువురు క్రీడాకారులు అభినందించారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ..అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 20న ఉదయం జిల్లా కేంద్రంలో శ్రీఒలింపిక్ డే రన్‌శ్రీను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
కామారెడ్డి అర్బన్: భారీ వర్షాలు, ఈదురు గాలులపై ఎన్పీడీసీఎల్ హైపర్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్టు ఎస్‌ఈ సాలియా నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక నైపుణ్యం సహాయంతో విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడమే హైపర్ సిక్స్ స్టెప్ ఫార్ములా ఉద్దేశ్యమని ఎస్‌ఈ పేర్కొన్నారు. హైపర్ సిక్స్‌లో కంట్రోల్ రూం, మ్యాన్‌పవర్, మెటీరియల్, వేగవంతమైన సమాచారం, ప్లానింగ్, మొబిలైజేషన్, యుద్ధ ప్రాతిపదికన పనులు, నిర్దేశిత సమయంలో విద్యుత్ పునరుద్ధరణ ఉంటాయని, కృత్రిమ మేధను దీనిలో వినియోగిస్తుమని ఎస్‌ఈ వివరించారు.
భిక్కనూరు:మండలంలోని కాచాపూర్ గ్రామంలో ఈ నెల 21 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న గంగమ్మ ఉత్సవాలకు హాజరు కావాలని కో రుతూ విద్య దాత తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డికి గంగపుత్ర సంఘం ప్రతినిధులు బుధవారం ఆహ్వాన పత్రికను అందజేశారు. గంగమ్మ ఉ త్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా వారు ఆయనను కోరారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): జనగాంలో కొన్ని రోజులుగా ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా సర్పంచ్ మధుబాయి మాట్లాడుతూ...ఆరాధ్య ఫౌండేషన్ సేవలు మరువలేనివన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరారు. కొన్ని రోజులుగా శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో సంస్థ కో–ఆర్డినేటర్ కౌడి అనిత, ఉప సర్పంచ్ శ్యాంరావు, వార్డు సభ్యులు శ్రీకాంత్, ప్రవీణ్, రమేశ్ పాల్గొన్నారు.


