ప్రీ ప్రైమరీ కేంద్రాలను రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రీ ప్రైమరీ కేంద్రాలను రద్దు చేయాలి

Jun 17 2026 5:03 AM | Updated on Jun 17 2026 5:03 AM

ప్రీ ప్రైమరీ కేంద్రాలను రద్దు చేయాలి అదనపు కలెక్టర్‌, డీఆర్వోను కలిసిన టీఎన్జీవోస్‌ నాయకులు

మాచారెడ్డి: ప్రీ ప్రైమరీ కేంద్రాలను రద్దుచేసి అంగన్వాడీలకు అప్పగించాలని అంగన్వాడీ టీచర్లు కోరారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలోని గాంధీ విగ్రహంతోపాటు మాచారెడ్డి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం అశోక్‌ కుమార్‌, ఘన్పూర్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం శారదలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ల సంఘం నాయకులు విజయ మాట్లాడుతూ.. ప్రీ ప్రైమరీ కేంద్రాల ఏర్పాటు వల్ల అంగన్వాడీ కేంద్రాలు ఖాళీ అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలను నిర్వీర్యం చేయడానికి ఫ్రీ ప్రైమరీ కేంద్రాలను తెచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీ టీచర్లు సరిత, సందేశ, మాధవీలత, సుజాత, సుమలత, మంజుల, రజిత ఉన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో

విద్యార్థుల సంఖ్య పెంచాలి

తాడ్వాయి(ఎల్లారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని డీఈవో మల్లికార్జున్‌ అన్నారు. ఆయన మంగళవారం తాడ్వాయి ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలన్నారు. పాఠశాలలో అన్నిరకాల సదుపాయాలు ఉన్నాయా అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గ దిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మధ్యా హ్న భోజనాన్ని వండేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. హెచ్‌ఎం కల్యాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

హోటళ్ల తనిఖీ

బోధన్‌టౌన్‌(బోధన్‌): పట్టణంలోని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, రెస్టారెంట్‌ హోటళ్లలో మంగళవారం జిల్లా ఆహార భద్రతాధికారి నవిత తనిఖీలు నిర్వహించారు. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లతోపాటు రెస్టారెంట్లలో ఫ్రిజ్‌లలో మిగిలిన, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, టెస్టింగ్‌ సాల్ట్‌, సింథటిక్‌ రంగులను గుర్తించారు. అనంతరం ఫాస్ట్‌ఫుడ్‌, రెస్టారెంట్‌ యజమానులకు నోటీసులు జారీ చేసి జరిమానా విధించారు.

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లాకు నూతనంగా వచ్చిన అదనపు కలెక్టర్‌ భుజరంగరావు, జిల్లా రెవెన్యూ అధికారి గీతను మంగళవారం టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు సుమన్‌ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచ్ఛం అందించి, శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కార్యదర్శి శేఖర్‌, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌, పెద్దోళ్ల నాగరాజు, తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement