భిక్కనూరు: ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు వారికి అవగాహన కల్పించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. మంగళవారం ఆయన భిక్కనూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. రోల్‌కాల్ ప్రాముఖ్యతను వివరించి వారు నిర్వహిస్తున్నర విధులు బాధ్యతలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరాల నియంత్రణకోసం పోలీసులు తప్పనిసరిగా పెట్రోలింగ్ చేయాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యను ఓపికగా విని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట సీఐ నరేశ్, ఎస్సై ఆంజనేయులు ఉన్నారు.
డిగ్రీ ప్రవేశాల
గడువు పొడిగింపు
కామారెడ్డి అర్బన్: డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ మూడో విడత దరఖాస్తుల గడువును ఈనెల 21 వరకు పొడిగించినట్టు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. స్వయంప్రతిపత్తితో పాటు అన్ని సౌకర్యాలున్న కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ఎంపిక చేసుకోవాలని కోరారు.
ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: ఈ విద్యా సంవత్సరానికి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, ఐటీఐలలో వివిధ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్ లలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ విషయాన్ని ఏటీసీ జిల్లా కన్వీనర్ ప్రమోద్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపా రు. పదో తరగతి పాసైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒకే దరఖాస్తు ద్వారా ప్రయివేట్, ప్రభుత్వ ఐటీ ఐ కళాశాలలతో పాటు ట్రేడ్‌లు ఎంపిక చేసుకోవచ్చని, దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 30 వరకు గడువుందని తెలిపారు.
4 నుంచి డిగ్రీ
వన్‌టైమ్ చాన్స్ పరీక్షలు
తెయూ(డిచ్‌పల్లి): డిగ్రీ వన్ టైమ్ చాన్స్ పరీక్షలు వచ్చేనెల 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలంగాణ యూనివర్సిటీ పరీ క్షల నియంత్రణ అధికారి సంపత్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ పరిధిలో డిగ్రీ వన్ టైమ్ చాన్స్ (2016 నుంచి 2020 విద్యా సంవత్సరాలు) 1, 2, 3, 4, 5, 6 సెమిస్టర్ల పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని సూచించారు.


