● ఐదుగురిపై హత్యాయత్నం కేసు నమోదు
నందిపేట్(ఆర్మూర్): ఓ యువకుడిపై దాడి చేసి హత్యాయత్నం చేసిన ఐదుగురిపై కేసు నమోదు చేసిన ఘటన ఆదివారం నందిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నందిపేట మండల కేంద్రంలోని రాజానగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన షేక్ నయ్యూంకు సమీప బంధువులతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. కాగా, షేక్ నయ్యూం ఆదివారం ఉదయం వివేకానంద చౌరస్తా సురేశ్ నగర్ కాలనీ వద్ద తన అన్న షేక్ ఖయ్యూం దుకాణానికి వెళ్లాడు. పాత కక్షలతో ఉన్న సమీప బంధువులైన షేక్ తాలీబ్, షేక్ తాహేర్, సాజిద్, షాహేద్, గాలిబ్‌తోపాటు మరికొంత మంది వ్యక్తులు కారులో వచ్చి ఇనుప రాడ్లు, కత్తులతో షేక్ నయ్యూంపై దాడికి పాల్పడ్డారు. దీంతో నయ్యూం తల, చేతులు, పొట్టపై తీవ్రగాయాలయ్యాయి. స్థానికులను చూసి దాడికి పాల్పడిన వారు పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితుడి అన్న షేక్ ఖయ్యూం ఘటనా స్థలానికి చేరుకొని 108 అంబులెన్సులో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు.
బాన్సువాడ రూరల్: ఆత్మహత్యకు యత్నించిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన జక్కాపురం సందీప్(19) ఈ నెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 13న రాత్రి మృతి చెందినట్లు బాన్సువాడ ఎస్‌హెచ్‌వో శ్రీధర్ తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బర్రెల కాపరిగా పనిచేసే సందీప్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, విచారణ కొనసాగుతోందన్నారు.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు కృష్ణ బిల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో కింద పడడంతో తీవ్రగాయాలైనట్లు కార్మిక సంఘం నాయకులు రజాక్ ఆదివారం తెలిపారు. బిల్డింగ్ సెంట్రింగ్ పనులు చేస్తున్న సమయంలో ఈదురు గాలులు వీయడంతో కృష్ణ భవనంపై నుంచి కింద పడ్డాడు. దీంతో ఎల్లారెడ్డిలో ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కృష్ణను కార్మికసంఘం నాయకులు పరామర్శించారు.
రక్తదానంతో
ఎంతోమందికి పునర్జన్మ
సుభాష్‌నగర్:రక్తదానం చేయడంతో ఎంతోమందికి పునర్జన్మను ప్రసాదించవచ్చని రోటరీ క్లబ్ జేమ్స్ అ ధ్యక్షుడు పాకాల నర్సింహారావు తెలిపారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం పురస్కరించుకొని నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోటరీ క్లబ్ జేమ్స్ ఆ ధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.21 మంది స్వచ్ఛందంగా రక్తదా నం చేశా రు.అనంతరం అధ్యక్షుడు నర్సింహారావు మాట్లాడుతూ ఆరోగ్యవంతులైన యువకులు నిర్ధిష్ట సమయంలో రక్తదానం చేయడంతో వారి ఆరోగ్యానికి ఎ లాంటి ప్రమాదం ఉండదన్నారు.రక్తం దొరకక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్య క్తంచేశారు.యువకులు ప్రతి మూడునెలలకొకసారి రక్తం దానం చేయవచ్చని తెలిపారు.కార్యక్రమంలో క్లబ్ సెక్రెటరీ గంజి రమేశ్, ప్రాజెక్ట్ చైర్మన్ కోటగిరి చంద్రశేఖర్, క్లబ్ సభ్యులు గిరీశ్ కుమార్,సంపత్ కు మార్,శేఖర్,ముక్కా శ్రీనివాస్,బంగారివీరబ్రహ్మం, నాగేశ్వరరావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.


