ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై పురోగతి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై పురోగతి

Jun 14 2026 7:16 AM | Updated on Jun 14 2026 7:16 AM

రాష్ట్ర ప్రభుత్వం సానుకులంగా ఉంది..

స్పష్టం చేసిన ఆర్‌ఎం ఎస్‌వీజీకే మూర్తి

నిజామాబాద్‌ రూరల్‌: ప్రభుత్వంలో టీజీఎస్‌ ఆర్టీసీ విలీనంపై పురోగతిలో స్పష్టత అభించిందని సంస్థ రీజియన్‌ మేనేజర్‌ ఎస్‌వీజీకే మూర్తి తెలిపారు. శని వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2021 వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ, ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీ ప రిశీలించి సానుకూల నిర్ణయం తీసుకున్నదన్నారు. ఆర్టీసీ విలీన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏ ర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ ఇప్పటికే విలీనానికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాలపై లోతైన సమీక్ష నిర్వహించిందని తెలిపారు. అదేవిధంగా సమ్మెకాలంలో మిగిలిన డి మాండ్లపై ఆర్టీసీ ఈడీల కమిటీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతోందని పేర్కొన్నారు. విలీన ప్రక్రియలో ప్రతి ఒక్క కార్మికుడి స్వరం వినిపించాలనేది కేబినెట్‌ సబ్‌ కమిటీ యాజమాన్యం ఉద్దేశమన్నారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని డిపోలలో కార్మిక శాఖ ప ర్యవేక్షణలో అత్యంత పారదర్శక పద్ధతిలో యూనియన్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను నిర్వహించడానికి తగి న చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భా గస్వాములను చేస్తామన్నారు. వారిచ్చే సలహాలను సబ్‌ కమిటీ పరిశీలనకు పంపి అందరికీ ఆమోదయోగ్యంగా, నూటికి నూరు శాతం పారదర్శకంగా విలీన తుది ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement