కామారెడ్డి అర్బన్: కామారెడ్డి మండలం గర్గుల్‌లో శనివారం ఉపాధి హామీ నిధులు రూ.15 లక్షలతో సిమెంట్ రోడ్డు పనులను సర్పంచ్ చింత దివ్య ప్రారంభించారు. ఉపసర్పంచ్ ప్రవీణ్, మాజీ సర్పంచులు నర్సింలు, రవితేజ గౌడ్, కాంగ్రెస్ నాయకులు భీంరెడ్డి, కిష్టారెడ్డి, కుమార్‌గౌడ్, లింబ్రాది, లింగం, వార్డు సభ్యులు స్వామి, శ్రీనివాస్, కిషోర్,రాజేష్‌రెడ్డి, నారాయణ, నవీన్‌రెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
నందిపేట్(ఆర్మూర్): మండల కేంద్రంలోని సురేశ్ నగర్ కాలనీలో పేకాట స్థావరంపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. కాలనీలోని ఒక ఇంటిలో కొంతమంది పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు జరిపి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 28,140తోపాటు 7 మొబైల్ ఫోన్లు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు.


