బాన్సువాడ : బీర్కూర్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. బీర్కూర్‌కు చెందిన వడ్ల రాజు కొత్తగా ఇల్లు నిర్మిస్తుండటంతో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. అద్దె ఇంటికి తాళం వేసి కొత్త ఇంటి వద్ద ఉండి రాత్రి ఆలస్యంగా రావడంతో తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న 3 తులాల బంగారం, 13 తులాల వెండి ఆభరణాలు, రూ. 1.20 లక్షల నగదు కనిపించలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి వేలిముద్రలు సేకరించారు.


