● ప్రతిభ కనబరుస్తున్న
క్రీడాకారులు
● సరదాగా మొదలై..
జాతీయ స్థాయి వరకు..
నిజామాబాద్ అర్బన్ : విశ్వ క్రీడల్లో అత్యంత ఆదరణ పొందిన సైక్లింగ్ పోటీల్లో ఇందూరు క్రీడాకారు లు ప్రతిభచాటుతున్నారు.రాష్ట్ర,జాతీయ స్థాయి పో టీల్లో పాల్గొని పతకాల పంట పండిస్తున్నారు. కోచ్ విజయ్‌కాంత్ రావు ఆధ్వర్యంలో క్రీడాకారులు తమ నైపుణ్యాన్నిమెరుగుపరుస్తూజిల్లాకువన్నెతెస్తున్నారు.
నేషనల్ చాంపియన్‌షిప్ వరకు..
సైక్లింగ్ పోటీలలో జిల్లాకు చెందిన క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందిస్తున్నాం. జాతీయ, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు మెలకువలు అందిస్తున్నాం. జాతీయస్థాయిలో జిల్లాకు పేరు తీసుకురావాలన్నదే తమ లక్ష్యం. దానికి అనుగుణంగానే శిక్షణ కొనసాగిస్తున్నాం.
– విజయ్‌కాంత్‌రావు, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు
సైక్లింగ్ పోటీలలో క్రీడాకారులకు ప్రభుత్వం చేయూతనివ్వాలి. శిక్షణకు మరింత సహాయం అందించాలి. సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మరింత మంది క్రీడాకారులకు ఉపయోగకరంగా ఉంటుంది.
– శిల్పా చౌహాన్, సైక్లింగ్ క్రీడాకారిణి
నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన రాఘవేందర్ సైక్లింగ్‌లో అద్భుత ప్రతి భ కనబరుస్తున్నాడు. తల్లి సౌమ్య, తండ్రి విజయ్ ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే సైక్లింగ్ ఆసక్తి పెంచుకున్నాడు. 2020 సంవత్సరంలో కరీంనగర్‌లో నిర్వహించిన నాల్గో డిస్ట్రిక్ట్ చాంపియన్‌షిప్‌లో మొదటి బహుమతి, ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన 16వ నేషనల్ చాంపియన్‌షిప్‌లో ద్వితీయ బహుమతి సాధించారు. 2021లో సిద్దిపేట ఇంటర్ డిస్ట్రిక్ట్ రోడ్ సైక్లింగ్ చాంపియన్‌షిప్, కర్ణాటకలో జరిగిన 17వ నేషనల్ చాంపియన్‌షిప్, ముంబైలో జరిగిన 25వ నేషనల్ రోడ్ చాంపియన్‌షిప్, రంగారెడ్డిలో నిర్వహించిన నేషనల్ రోడ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. అనంతరం కరీంనగర్‌లో నిర్వహించిన సైక్లింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి బహుమతులు అందుకున్నాడు.


