ఒకవైపు వృథా.. మరోవైపు వ్యథ | - | Sakshi
Sakshi News home page

ఒకవైపు వృథా.. మరోవైపు వ్యథ

Jun 14 2026 7:16 AM | Updated on Jun 14 2026 7:16 AM

సమస్య పరిష్కరిస్తాం..

పెద్ద కొడప్‌గల్‌(జుక్కల్‌): మండలంలోని బేగంపూర్‌ జీపీ కార్యాలయం వద్ద గల కాలనీలో తాగునీరు వృథాగా పోతుంది. నీరు మురుగు కాలువ నుంచి రోడ్డుపై ప్రవహించడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈవిషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మినీ వాటర్‌ ట్యాంకు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. మండలంలోని బబుల్‌గావ్‌, చింతల్‌వాడి, కుబ్యానాయక్‌ తండాతో పాటు, పలు గ్రామాల్లో తాగునీరు రాక ప్రజలు తంటాలు పడుతున్నారు. తాగునీటిని వ్యవసాయ బావుల నుంచి, వాటర్‌ ట్యాంకర్ల ద్వారా గ్రామ పంచాయతీ సిబ్బంది సరఫరా చేస్తున్నారు. దీంతో నీటి కోసం ఆయాగ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

వృథా అవుతున్న తాగునీటిని అరికడుతాం. మురు గు నీటి సమస్యను పరిష్కరిస్తాం. సమస్య పరిష్కరించాలని గ్రామకార్యదర్శికి ఆదేశిస్తా. నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం.

– అభినవ్‌ చందర్‌, ఎంపీడీవో

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement