వండర్‌ కిడ్‌! | - | Sakshi
Sakshi News home page

వండర్‌ కిడ్‌!

May 3 2026 7:47 AM | Updated on May 3 2026 7:47 AM

వండర్‌ కిడ్‌!

ఆ వయసులో పిల్లలు అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటుంటారు. బుడిబుడి అడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతూ అల్లరి చేస్తారు. కానీ కామారెడ్డికి చెందిన ఏడాదిన్నర వయసు కూడా లేని బాలుడు పునుగోటి హ్రిద్యాన్ష్‌రావు మాత్రం తన ప్రతిభతో ఔరా అనిపించుకుంటున్నాడు. రికార్డులు నెలకొల్పుతూ అవార్డులను సొంతం చేసుకుంటున్నాడు. – కామారెడ్డి టౌన్‌

జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌ కాలనీలో నివసించే పునుగోటి పావని, సాయిరామ్‌లకు 17 నెలల వయసున్న కుమారుడు హ్రిద్యాన్ష్‌రావు ఉన్నాడు. తండ్రి బేకరీ నిర్వహిస్తుండగా.. తల్లి యూపీఎస్‌సీ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతోంది. తమ కుమారుడిలోని అసాధారణ మేధస్సును గుర్తించిన తల్లిదండ్రులు.. అతడిని ప్రోత్సహించారు. నెలల వయసునుంచే ఎన్నో విషయాలను నేర్పించారు. అతడి ప్రతిభకు పదునుపెట్టి ప్రపంచానికి పరిచయం చేశారు.

చిన్న వయసులో

పెద్ద ఘనతలు

హ్రిద్యాన్ష్‌రావు అసాధారణమైన జ్ఞాపకశక్తితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 14 నెలల వయసునుంచే అతడు ఆల్ఫాబెట్స్‌ను గుర్తుపట్టడమే కాకుండా వాటి ఫోనిక్‌ సాంగ్‌ను కూడా పాడగలడు. మానవ శరీర భాగాల పేర్లు, ఒకటి నుంచి 20 వరకు సంఖ్యలు, చాలా రకాల జంతువుల పేర్లు, పండ్ల పేర్లు, వివిధ వాహనాల పేర్లు.. ఇవన్నీ అతనికి కొట్టినపిండిగా మారాయి. కూర్చుకోవడం, నిల్చోవడం, నడవడం, నవ్వడం, ఏడవడం వంటి యాక్షన్‌ వర్డ్స్‌ ను కూడా గుర్తించగలడు. వారంలోని 7 రోజులు, సంవత్సరంలోని 12 నెలల పేర్లు, అలాగే సౌర కుటుంబంలోని 9 గ్రహాల పేర్లు కూడా టకాటకా చెబుతున్నాడు. ఈ అసాధారణ ప్రతిభ కారణంగా హ్రిద్యాన్ష్‌రావు ఇప్పటివరకు పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నాడు. హ్రిద్యాన్ష్‌రావు ప్రతిభకు సంబంధించిన వీడియోను అతడి తల్లిదండ్రులు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థకు పంపించగా.. వాటిని పరిశీలించి రికార్డ్స్‌లో చోటు కల్పించారు. ఈ బుడతడు ఇప్పటికే డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం అవార్డు, లెజెండ్స్‌ ఆఫ్‌ భారత్‌ –2026 అవార్డులను కూడా కై వసం చేసుకున్నాడు. తమ కుమారుడి ప్రతిభకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్ట్స్‌లో చోటు కోసం ప్రయత్నిస్తున్నట్లు బాలుడి తల్లిదండ్రులు ‘సాక్షి’ తో పేర్కొన్నారు.

ఏడాదిన్నర వయసులోనే అసాధారణ

ప్రతిభ చూపుతున్న హ్రిద్యాన్ష్‌రావు

ఈ బుడతడికి అక్షరాలు, గ్రహాలు,

జంతువుల పేర్లు కొట్టినపిండి

ఇప్పటికే ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌

రికార్డ్స్‌’లో చోటు

బాలుడి ఖాతాలో అబ్దుల్‌ కలాం

నేషనల్‌ స్టార్‌, లెజెండ్స్‌ ఆఫ్‌

భారత్‌ అవార్డులు..

Advertisement
 
Advertisement
Advertisement