కేంద్ర ప్రభుత్వ ఒప్పందాలతో దేశానికి నష్టం | - | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వ ఒప్పందాలతో దేశానికి నష్టం

Apr 16 2026 10:12 AM | Updated on Apr 16 2026 10:12 AM

యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి రోషిణి జైస్వాల్‌

భిక్కనూరు: కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో ఇతర దేశాలతో చేసుకుంటున్న ఒప్పందాలతో దేశానికి భవిష్యత్తులో తీరని నష్టం వాటిల్లుతుందని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి రోషిణి జైస్వాల్‌ అన్నారు. బుధవారం భిక్కనూరులో ఆమె మాట్లాడుతూ.. అమెరికాతో మన కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకుంటున్న ఒప్పందంతో మన దేశ రైతన్నకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. కేవలం అధికారంలో ఉండాలనే దురుద్దేశంతో బీజేపీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. అందులో ఎంపీ సీట్ల పెంపు ఒకటి అన్నారు. విదేశీ ఉత్పత్తుల దిగుమతి వల్ల దేశీయ రైతులకు గిట్టుబాటు ధర లభించకుండా పోతుందన్నారు. యువత తలచుకుంటే సమాజంలో గొప్ప మార్పు సాధ్యమని పార్టీ సిద్ధాంతాలను గడపగడపకు తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రకాంత్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుదర్శన్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు బీంరెడ్డి, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీరాం వెంకటేష్‌, ఉపసర్పంచ్‌ దుంపల మోహన్‌రెడ్డి నేతలు మైపాల్‌రెడ్డి, నర్మల రాంచంద్రం, తుడుము స్వామి విలియమ్స్‌ ప్రవీణ్‌, ప్రదీప్‌ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement