ఫ్యూచర్ సిటీగా ఎల్లారెడ్డి
● అభివృద్ధే నా లక్ష్యం
● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు
ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్: ఫ్యూచర్ సిటీగా ఎల్లారె డ్డి అభివృద్ధి చెందుతుందని, అమెరికాలా ఎల్లారెడ్డి ని అభివృద్ధి చేస్తున్నామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మద న్‌మోహన్‌రావు అన్నారు. బుధవారం ఎల్లారెడ్డిలో రూ.5 కోట్లతో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, విలీన గ్రామాలైన దేవునిపల్లి, లింగారెడ్డిపేట, గండిమాసానిపేట, కొత్తపల్లి గ్రామాలలో సీసీ రోడ్డు పనులు, రూ.2 కోట్ల మార్కెట్ కమిటీ నిధులతో షాపింగ్ కాంప్లెక్స్, మార్కెట్ కమిటీ భవన నిర్మాణం, వేబ్రిడ్జి, టాయిలెట్స్, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు శంకుస్థాపన చేయగా, రూ. 10 లక్షలతో ఆర్డీవో కార్యాలయంలో నిర్మించిన రికార్డు గదిని ఆయన ప్రారంభించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లారెడ్డి అభివృద్ధి తన మంత్రమని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 14 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో సైతం 12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ గెలిచి మున్సిపల్‌పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెదలో 20 వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పార్థసింహారెడ్డి, డీఎస్‌పీ శ్రీనివాస్‌రావు, ఎల్లారెడ్డి, గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్లు రజిత, పరమేశ్, వైస్ చైర్మన్ రాజు, డైరెక్టర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్లు కుడుముల సత్యనారాయణ, పద్మశ్రీకాంత్, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్‌గౌడ్, పట్టణ అధ్యక్షులు వినోద్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు పప్పు వెంకటేశం, ఆరీఫ్, గఫార్, షేకావత్, సాయిబాబా, విద్యాసాగర్, నీలకంఠం, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమీషనర్ మహేష్‌కుమార్, ఏఈ వినోద్, కాంగ్రెస్ నాయకులు అరుణ, స్వరూప, వాసవి తదితరులున్నారు.
సీసీ రోడ్డు పనుల పరిశీలన
ఎల్లారెడ్డిలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు బుధవారం పరిశీలించారు. పట్టణంలోని లింగారెడ్డిపేట తండా, 12వ వార్డులలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. పనులు నాణ్యతగా చేయడంతో ఎక్కువ రోజుల పాటు మన్నికగా ఉంటుందని అన్నారు.
ఉపాఽధి పనులు కల్పించండి
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని కాలనీ వాసులకు ఉపాధి పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు కాలనీ వాసులు బుధవారం ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు విన్నవించారు. మున్సిపాలిటీ ఏర్పడిన తరువాత తమ కాలనీ మున్సిపాలిటీలో విలీనం చేయడంతో ఉపాధి పనులను కోల్పోవడంతో ఉపాధి లేకుండా పోయిందన్నారు.
ఎల్లారెడ్డిలో 29,209 మంది గృహజ్యోతి
వినియోగదారులు
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి విద్యుత్ శాఖ డివిజన్ పరిధిలో 29, 209 మంది గృహజ్యోతి వినియోగదారులు ఉన్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పంపిన సంక్రాంతి పండగ శుభాకాంక్షల లేఖను విద్యుత్ శాఖ డీఈ విజయసారథి ఎమ్మెల్యేకు అందించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు భట్టి విక్రమార్క తెలపడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఏఈ వెంకటస్వామి, ఏడీ, లైన్‌మెన్లు శశికాంత్‌రెడ్డి, విఠల్‌రావు తదితరులున్నారు.


