జుక్కల్ సంక్రాంతి సంబరాల్లో మహారాష్ట్ర సంప్రదాయం
బిచ్కుంద(జుక్కల్): జుక్కల్ నియోజక వర్గం మహారాష్ట్ర, కర్ణాటక రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉంది. ఇక్కడి రైతులు సంక్రాంతి పండగను మహారాష్ట్ర సంప్రదాయాన్ని పాటించడం ఆనవాయితీ. సంక్రాంతి రోజున రైతులు కుటుంబ సమేతంగా పంట చేలకు వెళ్లి ధాన్యలక్ష్మి, పాండవుల ఐదు విగ్రహాలు ప్రతిష్ఠించి ఎడ్ల అరక కట్టి పూజలు చేసి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. పంటల మద్య ప్రత్యేక వంటకాలు చేస్తారు. దేవతల దగ్గర దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో తలకు తలపాగ కట్టి (రుమాలు) గాంధీ టోపి పెట్టుకొని రైతులు పూజలు చేస్తారు.దీపాన్ని గంపలో పెట్టుకొని సాయంత్రం ఇంటికి తీసుకొస్తారు. జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, పెద్దకొడప్‌గల్ మండలాల ప్రజలు మహారాష్ట్ర సంప్రదాయం పాటిస్తారు. సంక్రాంతి తర్వాత భోగి, కనుమను ఘనంగా జరుపుకుంటారు. కనుమ రో జున గ్రామ శివారులో మట్టితో ఏబిజ్ గాడ్ దేవుని విగ్రహం తయారు చేస్తారు.అడవిలో పశువులు, కాపరులకు మృగాల నుంచి హాని జరగకుండా ఏబిజ్ గాడ్ కాపాడతాడని వారి నమ్మకం.


