దోమకొండను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి
దోమకొండ: దోమకొండను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం దోమకొండ సర్పంచ్ ఐరేని నర్సయ్య ప్రభుత్వ సలహాదారు హైదరాబాద్‌లోని షబ్బీర్‌అలీని ఆయన నివాసంలో కలసి వినతిపత్రం అందజేశారు. దోమకొండ గతంలోనే సమితిగా, తాలూకాగా కొనసాగిందని వివరించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి ఈవిషయాన్ని తీసుకెళ్లాలని కోరారు. ఈనెల 30న దోమకొండలో నిర్వహించే ఊర పండగ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, రాష్ట్ర నాయకులు ఇలియాస్‌లను కలిసి విన్నవించారు.కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సీతారాం మధు, నాయకులు రాజేందర్, స్వామి, మల్లేశం, శంకర్, సంతోష్, లింగం, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ కౌన్సిలర్ కన్నయ్య కుటుంబానికి పరామర్శ
కామారెడ్డి టౌన్: మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కోయల్‌కార్ కన్నయ్య తల్లి ఇటీవల మరణించడంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, కాంగ్రెస్ నాయకులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. యువజన రాష్ట్ర నా యకుడు ఇలియాస్, నాయకుడు నయీం, నా యకులు పండ్లరాజు, అశోక్‌రెడ్డి తదితరులున్నారు.


