అభివృద్ధి అంతంతే..! | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి అంతంతే..!

Oct 10 2025 6:00 AM | Updated on Oct 10 2025 6:00 AM

అభివృద్ధి అంతంతే..!

అభివృద్ధి అంతంతే..!

అభివృద్ధి అంతంతే..! విద్యారంగం..

కామారెడ్డి జిల్లా పోలీస్‌ కార్యాలయం

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ఏర్పాటై తొమ్మిదేళ్లయ్యింది. అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాను 2016 అక్టోబర్‌ 11న ప్రారంభించింది. జిల్లా ఏర్పాటుతో పాలన ప్రజలకు చేరువైంది. జిల్లా ఏర్పాటుతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విషయంలో పర్యవేక్షణ పెరిగింది. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కావడానికి దోహదపడింది. ఉమ్మడి జిల్లాలో అధికార యంత్రాంగం అన్ని ప్రాంతాలకు వెళ్లడం ఇబ్బందిగా ఉండేది. ఒక్కో ప్రాంతానికి ఏడాదికోమారు కూడా వెళ్లే పరిస్థితులు ఉండేవి కాదు. కానీ జిల్లా ఏర్పాటైన తరువాత కలెక్టర్‌తోపాటు జిల్లా స్థాయి అధికారులు ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తూ పర్యవేక్షిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఆవిర్భవించిన మరుసటి ఏడాది జిల్లా కలెక్టరేట్‌తోపాటు జిల్లా పోలీసు కార్యాలయ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. నాలుగేళ్లపాటు పనులు కొనసాగగా, 2021 జూన్‌ 20వ తేదీన అప్పటి సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. కాగా కామారెడ్డి జిల్లా ఏర్పాటై తొమ్మిదేళ్లవుతున్నా అభివృద్ధిలో మాత్రం ఇంకా వెనుకబడే ఉందనే చెప్పాలి. జిల్లాలో సాగునీటి సమస్యతోపాటు మరెన్నో సమస్యలు పరిష్కారం కాలేదు.

జిల్లా కేంద్రంలో..

కామారెడ్డి పట్టణం జిల్లా కేంద్రంగా మారిన తరువాత భూముల ధరలు పెరిగాయే తప్ప సౌకర్యాలు మాత్రం మెరుగుపడలేదు. ఇటీవల జిల్లా కేంద్రంలో భారీ వరదలతో జీఆర్‌ కాలనీ, కౌండిన్య కాలనీ, హౌజింగ్‌ బోర్డు, దేవీవిహార్‌ తదితర కాలనీలు వరదలతో అతలాకుతలమైన విషయం తెలిసిందే. నాలాలు కబ్జాల చెర వీడలేదు. చిన్న వర్షం కురిసినా రోడ్లు చెరవులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలు కురిసిన సమయంలో పరిస్థితి ఘోరంగా తయారవుతోంది. జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ చేపట్టకపోవడంతో ట్రాఫిక్‌ కష్టాలు రెట్టింపయ్యాయి. స్టేషన్‌రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, అడ్లూర్‌ రోడ్డు, అశోక్‌నగర్‌రోడ్డు, జన్మభూమి రోడ్లు విస్తరణకు నోచుకోలేదు. దశాబ్దాలుగా సమస్య పెండింగ్‌లోనే ఉన్నాయి. పట్టణాన్ని రెండుగా విభజించే రైల్వే లైన్‌పై ట్రాఫిక్‌ కష్టాలకు అంతులేదు. నిత్యం యాభైకి పైగా రైళ్లు, అలాగే గూడ్స్‌ రైళ్ల రాకపోకలతో గేట్‌ వేసినపుడల్లా వాహనాదరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజాంసాగర్‌ చౌరస్తా, సీఎస్‌ఐ చర్చి కూడలి, మున్సిపల్‌ కూడలి, ప్రభుత్వ ఆస్పత్రి, రామారెడ్డి రోడ్‌, ధర్మశాల కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ సమస్యలు రెట్టింపయ్యాయి. జంక్షన్‌ల అభివృద్ధి జరగడం లేదు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. రైతులు రోడ్ల మీదే కూరగాయలు అమ్ముకుంటున్నారు. బస్‌ షెల్టర్ల నిర్మాణం లేక వానొచ్చినా, ఎండొచ్చినా పట్టణంలోని పాతబస్టాండ్‌, హైదరాబాద్‌ రోడ్డులోని గెస్ట్‌హౌజ్‌, నిజాంసాగర్‌ రోడ్డులో ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

జిల్లా ఆవిర్భవించి రేపటికి తొమ్మిదేళ్లు

పాలన చేరువైనా..

పరిష్కారం కాని సమస్యలు

జిల్లా కేంద్రంలో మెరుగుపడని

సౌకర్యాలు

అసంపూర్తిగా ప్యాకేజీ 22 పనులు

కనిపించని సౌత్‌క్యాంపస్‌ అభివృద్ధి

జిల్లా కేంద్రంలో విద్యారంగ అభివృద్ధికి అవకాశాలున్నా ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చింది. కళాశాల, హాస్టల్‌ భవనాల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. అయితే ఇంజినీరింగ్‌, డీఎడ్‌, బీఎడ్‌, నర్సింగ్‌ కాలేజీలు ఒక్కటీ రాలేదు. సౌత్‌ క్యాంపస్‌ అభివృద్ధి ముందుకు కదలడం లేదు. జుక్కల్‌, ఎల్లారెడ్డిలకు ఇంటిగ్రేటెడ్‌ గురుకులాలు మంజూరైనా ఇప్పటికీ పనులు మొదలుకాలేదు. కామారెడ్డికి ఇప్పటికీ మంజూరు కాలేదు. జిల్లా అభివృద్ధిపై ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement