
ఎమ్మెల్యే భూపతి రెడ్డికి సీఎం పరామర్శ
● ‘ద్వాదశ దినకర్మ’కు హాజరైన
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్
మహేశ్ కుమార్ గౌడ్
సుభాష్‌నగర్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు పరామర్శించారు. నగరశివారులోని ఓ కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన భూపతిరెడ్డి మాతృమూర్తి రేకులపల్లి లక్ష్మీనర్సమ్మ ద్వాదశ దిన కర్మ కార్యక్రమానికి హాజరై చిత్ర పటానికి నివాళులు అర్పించారు. భూపతిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సంతాపాన్ని తెలియజేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, రాకేశ్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు తాహెర్ బిన్ హందాన్, ఈరవత్రి అనిల్, మానాల మోహన్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జులు వినయ్‌రెడ్డి, పోచారం భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నగేష్‌రెడ్డి, ఈగ గంగారెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్ గౌడ్, వేణుగోపాల్ యాదవ్, మునిపల్లి సాయిరెడ్డి, గడ్కోల్ భాస్కర్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీఎంకు స్వాగతం పలికిన కలెక్టర్, సీపీ
సీఎం రేవంత్‌రెడ్డికి కలెక్టరేట్‌లో హెలీప్యాడ్ వద్ద కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయిచైతన్య జిల్లా అధికారులు పుష్ఫగుచ్చం అందించి స్వాగతం కలిపారు.