
ప్రతీ హిందువు ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగస్వాములు కావాలి
● విద్యాభారతి దక్షిణ మధ్య కార్యదర్శి
అయాశిస్సుల లక్ష్మణ్‌రావు
● బాన్సువాడలో ఆర్‌ఎస్‌ఎస్
శతాబ్ది ఉత్సవం
బాన్సువాడ: ప్రతీ హిందువు ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగస్వాములు కావాలని విద్యాభారతి దక్షిణ మధ్య కార్యదర్శి అయాశిస్సుల లక్ష్మణ్‌రావు అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శనివారం శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఇందులోభాగంగా పట్టణంలో భారీ సంఖ్యలో స్వయం సేవకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళాశాల మైదానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి హిందువు సమాజ సేవ చేయాలని, సంఘటితంగా ఉండాలన్నారు. కులం, వర్గాలను దూరం పెట్టాలని సూచించారు. హిందుత్వం కోసం పాటు పడాలని పేర్కొన్నారు. కుటుంబం, స్వదేశీ, పౌర కర్తవ్యం తదితర అంశాలపై మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు సత్యనారాయణ, రాంరెడ్డి, వెంకట్రావ్, రవీంద్రనాథ్‌ఆర్య, నాగులగామ వెంకన్న, నాగిరెడ్డి, బీజేపీ నాయకులు పైడిమల్ లక్ష్మినారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, కోనాల గంగారెడ్డి, శ్రీనివాస్, చీరంజీవి, చీకట్ల రాజు, గంగారం, శంకర్‌గౌడ్, మోహాన్‌రెడ్డి, నాగరాజు, దత్తు, సాయిబాబా, సాయిరెడ్డి, లక్ష్మణ్, విఠల్, రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రతీ హిందువు ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగస్వాములు కావాలి