సైన్యం పరాక్రమానికి ప్రతీక సిందూర్
కామారెడ్డి టౌన్: భారత సైన్యం పరాక్రమానికి ప్రతీ క అపరేషన్ సిందూర్ అని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. పహల్గాంలో ఉగ్రదాడి అనంత రం మన దేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థా న్, పీవోకేలలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని సోమ వారం జిల్లాకేంద్రంలో తిరంగా ర్యాలీ నిర్వహించా రు. గాంధీ గంజ్ వద్ద ప్రారంభమైన ర్యాలీ.. పుర వీధుల మీదుగా సాగింది. జాతీయ జెండాలతో పాటు ఆపరేషన్ సిందూర్ ప్లకార్డులు, మోదీ కటౌట్‌లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా పూర్తి చేసి పాకిస్థాన్‌పై విజయం సా ధించినందుకు త్రివిధ దళాలకు కృతజ్ఞతలు తెలిపా రు. దేశ సైనికుల వీరత్వాన్ని, త్యాగాన్ని ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. దేశ ప్రజలు వారికి రుణపడి ఉంటారన్నారు. మోదీ పాలనలో దేశం సురక్షితంగా ఉందన్నారు. ర్యాలీలో బీజేపీ రాష్ట్ర నాయకులు మురళీధర్ గౌడ్, రంజిత్ మోహన్, జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మోదీ పాలనలో దేశం సురక్షితం
తిరంగా ర్యాలీలో ఎమ్మెల్యే కేవీఆర్
సైన్యం పరాక్రమానికి ప్రతీక సిందూర్


