ఆయిల్‌పాం సాగుపై దృష్టి సారించాలి
బీబీపేట: ఆయిల్‌పాం సాగుకు రైతులు ముందుకు రావాలని, దాని వల్ల సుమారు 30 ఏళ్లవరకు ఆదాయం సంపాదించవచ్చని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం యాడారంలో హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయిల్‌పాం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ధర్మారెడ్డి రైతు పది ఎకరాల్లో 525 మొక్కలు నాటుతున్నారన్నారు. జిల్లాలో ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆయిల్‌పాం మొక్కల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. జిల్లాలో ఆయిల్‌పాం ఫ్యాక్టరీ పెట్టడానికి హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ కసరత్తు చేస్తోందన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఉద్యాన శాఖ అధికారి సంతోషిరాణి, అధికారులు వరుణ్, విజయ రామస్వామి, నసీం, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, ఎంపీడీవో పూర్ణచంద్రోదయకుమార్, తహసీల్దార్ సత్యానారాయణ, ఏవో నరేందర్, ఏఈవోలు సంతోష్, రమేష్, హెచ్‌యూఎల్ జనరల్ మేనేజర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.


