ఇందూర్‌లో భావ్‌సర్‌లు | - | Sakshi
Sakshi News home page

ఇందూర్‌లో భావ్‌సర్‌లు

May 19 2025 2:13 AM | Updated on May 19 2025 2:13 AM

ఇందూర

ఇందూర్‌లో భావ్‌సర్‌లు

బలూచిస్తాన్‌ ప్రత్యేక దేశంగా అవతరించాలని భారత ప్రజలు ముఖ్యంగా భావ్‌సర్‌

క్షత్రియులు బలంగా కోరుకుంటున్నారు. బలూచ్‌ ప్రాంతంలోని అమ్మవారి శక్తిపీఠాన్ని

స్వేచ్ఛగా సందర్శించే అవకాశం కలుగుతుందని ఆశించడమే అందుకు ప్రధాన కారణం.

విభజన సమయంలో బలూచ్‌ ప్రాంతాన్ని వీడి వచ్చిన భావ్‌సర్‌ క్షత్రియ సమాజ్‌ దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఇందూరులో వేయి కుటుంబాలకు పైగా ఉండగా, వారు తమ ఆరాధ్య దైవం హింగులా మాత ఆలయాన్ని నిర్మించి ప్రత్యేకంగా కొలుస్తున్నారు.

నగరంలో హింగులామాతకు ఆలయం

భావసార్‌ క్షత్రియ సమాజ్‌ ఆధ్వర్యంలో

1982లో నిర్మాణం

దేశ విభజన సమయంలో ఇక్కడికి రాక

ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో

హింగులా శక్తిపీఠంపై ఆసక్తి

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో పాక్‌ ఆక్రమిత కశ్మీ ర్‌ కన్నా ఎక్కువగా ఆ దేశానికి నైరుతిభాగంలో ఉన్న బలూచిస్తాన్‌ అంశంపైనే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పాకిస్తాన్‌ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా కొనసాగేందుకు బలూచిస్తాన్‌ తగిన ఏర్పాట్లు చేసుకుంటుండగా, భారతదేశంలోని ప్రతిఒక్క రూ ప్రత్యేక బలూచిస్తాన్‌ దేశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే భారతదేశ విభజన సమయంలో బలూచిస్తాన్‌ ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చిన భావ్‌సర్‌ క్షత్రియ సమాజ్‌ వారు మాత్రం మరింత ఆసక్తిగా, బలూచిస్తాన్‌ ప్రత్యేక దేశంగా అవతరించాలని బలంగా కో రుకుంటున్నారు. తమ మూలస్థానమైన బలూచ్‌లో కొలువై ఉన్న హింగులా మాతను మొ క్కుకుంటున్నారు. అఖండ భారత్‌లో భాగమైన బలూచ్‌ ప్రాంతంలోని అమ్మవారి శక్తిపీఠాన్ని స్వేచ్ఛగా సందర్శించే అవకాశం కలగాలని కోరుకుంటున్నారు.

అమ్మవారి 52 శక్తి స్వరూపాల్లో ఒకటైన హింగులాదేవి ప్రధాన ఆలయం పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లోని హింగోల్‌ నేషనల్‌ పార్క్‌లో ఉంది. కరాచీకి 90 కిలోమీటర్ల దూరంలో హింగుల పర్వతంపై హింగోసీ నదీతీరం ఈ శక్తిపీఠానికి మూలస్థానం. హింగులా మాత అసలు పే రు కోటరి. హింగుల పర్వతంపై ఉండడంతో హింగులాదేవిగా ప్రసిద్ధి పొందింది. ఈ పర్వ తంపై గుహలో హింగులామాత నిత్యం జ్వలి స్తూ దర్శనమిస్తోంది. ప్రకృతి నిర్మిత గుహ ఆలయంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన అష్టదిగ్గజాల్లో ఒకరైన అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రలో హింగులాదేవి ప్రస్తావన ఉంది. ఇంతటి ప్రాచీన చరిత్ర కలిగిన శక్తిస్వరూపిణి ఆలయాన్ని ఇందూరు నగరంలో భావ్‌సర్‌ క్షత్రియ సమాజ్‌ (రంగరి) (వస్త్రాలకు రంగులు వేసే) ఆధ్వర్యంలో 1982లో నిర్మించారు.

ఇందూరులోని హింగుళాంబిక మాత ఆలయం

దేశవిభజన సమయంలో ఇక్కడికి..

దేశవిభజన సమయంలో రంగరి (భావ్‌సర్‌ క్షత్రియ సమాజ్‌) కులస్తులు బలూచిస్తాన్‌ ప్రాంతం నుంచి రాజస్తాన్‌కు వలస వచ్చారు. ఆ తరువాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం నిజా మాబాద్‌ జిల్లాలో ఈ సమాజ్‌కు చెందిన వేయికి పైగా కుటుంబాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం క్షత్రియులుగా ఉన్న వీరిని అంతమొందించేందుకు పరశురాముడు వెంటాడితే వీరి వంశీయులు దేవీమాత శరణు కోరగా హింగులాదేవి కాపా డి వస్త్రాలకు రంగులు అద్దే కళను కటాక్షించింది. అప్పటి నుంచి ఈ వృత్తిని చేస్తున్నట్లు ఈ సమాజ్‌ పెద్దలు తెలిపారు.

ఇందూర్‌లో భావ్‌సర్‌లు1
1/3

ఇందూర్‌లో భావ్‌సర్‌లు

ఇందూర్‌లో భావ్‌సర్‌లు2
2/3

ఇందూర్‌లో భావ్‌సర్‌లు

ఇందూర్‌లో భావ్‌సర్‌లు3
3/3

ఇందూర్‌లో భావ్‌సర్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement