నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మహిళాచట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా అడిషనల్ డీఆర్‌డీవో మురళీకృష్ణ సూచించారు. మండలకేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో శుక్రవారం మానవ అక్రమరవాణా నిరోధకతపై గ్రామసంఘం అధ్యక్షులతోపాటు వీవోఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ అక్రమరవాణాను నిరోధించడానికి, మహిళలను లైంగిక వేధింపుల నుంచి రక్షించేందుకు మహిళాసంఘాల సభ్యులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శాంత, ఏపీయం జగదీశ్, అకౌంటెంట్ రాజు తదితరులున్నారు.
లింగంపేటలో..
లింగంపేట(ఎల్లారెడ్డి): మానవ అక్రమ రవాణ నేరం అని అడిషనల్ డీఆర్‌డీవో మురళీకృష్ణ వెల్లడించారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఆయా గ్రామాల గ్రామ సంఘాల అధ్యక్షుల సమావేశంలో మాట్లాడారు. మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు సులోచన, సీసీలు మేహర్, గంగరాజు, రాజిరెడ్డి, నజీర్, శ్రావణ్, స్వప్న, అంజయ్య, మన్సూర్‌ఖాన్, ఆయా గ్రామాల గ్రామ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.
అడిషనల్ డీఆర్‌డీవో మురళీకృష్ణ