కాళ్లరిగేలా తిరుగుతున్నా.. | - | Sakshi
Sakshi News home page

కాళ్లరిగేలా తిరుగుతున్నా..

Jun 23 2026 12:18 AM | Updated on Jun 23 2026 12:18 AM

రెండు కాళ్లు చచ్చుబడిపోయినా అధికారులు స్పందించడం లేదు. గత రెండేళ్లుగా అనేకసార్లు ఫిర్యాదు చేసినా నాకు వికలాంగ పింఛన్‌ ఇవ్వడం లేదు. సదరం సర్టిఫికెట్‌ కావాలని అధికారులు చెబుతున్నారు. ఆ సదరం సర్టిఫికెట్‌ కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అనేక సార్లు తిరిగాను, అయినా ఎవరూ స్పందించడం లేదు.

– పసుపులేటి నరసింహమూర్తి,

రాజుపాలెం, కిర్లంపూడి మండలం

ఆన్‌లైన్‌లో తప్పు సరిచేయడం లేదు

నా వ్యవసాయ భూమి 4.43 ఎకరాలను ఆన్‌లైన్‌లో దేవదాయ భూమిగా చూపిస్తోంది. దీంతో ప్రభుత్వం నుంచి నాకు ఏ విధమైన సహాయం అందడం లేదు. ఆ భూమి కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూమి. ఆన్‌లైన్‌ తప్పును సరిచేయాలని గత రెండేళ్లుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నాను. ఎటువంటి ప్రయోజనం కనిపించడం లేదు. తిరిగి తిరిగి విసుగు చెందాను.

– వి.వెంకన్నదొర, రావికంపాడు, తొండంగి మండలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement