రూ.వెయ్యి నోటు రద్దుకు 48 ఏళ్లు!
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రూ.వెయ్యి నోటు ఎప్పుడు రద్దయ్యిందంటే టక్కున 2016లో మోదీ ప్రభుత్వం రద్దుచేసిందని చెప్పేస్తారు. కానీ అంతకు ముందే కొన్నేళ్ల క్రితం చలామణిలో ఉన్న ఈ రూ.వెయ్యి నోటు రద్దయ్యి నేటి సరిగ్గా 48 ఏళ్లయ్యింది. 1978 జనవరి 15వ తేదీన అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్, రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిల హయాంలో కొన్ని ఆర్థిక కారణాల రీత్యా పెద్ద నోట్లను రద్దు చేశారు. 72 ఏళ్ల కిందట 1954లో భారత రిజర్వు బ్యాంక్ ఈ వెయ్యి నోట్లను విడుదల చేసింది. రిజర్వు బ్యాంక్ గవర్నర్ బి.రామారావు సంతకంతో మొదటిసారిగా ఈ నోటును ముద్రించారు. ఈ నోటును కాకినాడకు చెందిన ప్రముఖ నాణేల సేకరణకర్త మార్ని జానకిరామ చౌదరి సేకరించి భద్రపరిచారు. ఈ నోటు 20.3 సెంటీ మీటర్ల వెడల్పు, 12.7 సెంటీమీటర్ల ఎత్తుతో సుమారు పావుఠావు పరిమాణంతో చలామణీలో ఉండేది. జానకిరామ చౌదరి మాట్లాడుతూ నోటుకు ముందువైపు మూడు సింహాల చిత్రం, వెనుకవైపు తంజావూరు (తమిళనాడు) లో వెయ్యేళ్ల కిందట నిర్మించిన బృహదీశ్వరాలయం చిత్రాన్ని ముద్రించారని, దీనితో పాటు చలామణిలో ఉండే ఐదు వేలు, పది వేల రూపాయల నోట్లను కూడా నాటి ప్రభుత్వం 1978 జనవరి 15 తేదీన రద్దు చేసిందని తెలిపారు.
జేఎన్‌టీయూకేకి
ఈఏపీ సెట్ బాధ్యత
కన్వీనర్‌గా ఎన్.మోహనరావు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కోర్సుల ప్రవేశ పరీక్షల్లో అత్యంత కీలకమైన ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ సంబంధిత కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026–27 ఏడాదికి సంబంధించి పరీక్ష నిర్వహణ బాధ్యతను జేఎన్‌టీయూకేకి అప్పగించారు. పదో సారి పరీక్ష నిర్వహణ బాధ్యతను వర్సిటీ నిర్వహి హిస్తోంది. 2015 నుంచి 2019 వరుసగా ఐదుసార్లు నిర్వహించగా కన్వీనర్‌గా ప్రొఫెసర్ సాయిబాబు వ్యవహరించారు. మళ్లీ 2021–22కు సంబంధించి రెండుసార్లు ప్రొఫెసర్ వి.రవీంద్ర, 2024లో ప్రొఫెసర్ వెంకటరెడ్డి పరీక్ష నిర్వహించగా, గత ఏడాది ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు, ఈ ఏడాది జేఎన్‌టీయూకే కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.మోహనరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన గతంలో ఈఏపీ సెట్‌కు రెండు సార్లు కో–కన్వీనర్‌గా వ్యవహరించారు.
రూ.వెయ్యి నోటు రద్దుకు 48 ఏళ్లు!
రూ.వెయ్యి నోటు రద్దుకు 48 ఏళ్లు!


