
ఉచితం.. బుసు్స!
ఉమ్మడి జిల్లాలో మాత్రమే
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆర్టీసీ కేటాయించిన బస్సుల్లో మాత్రమే మహిళలు ప్రయాణించాల్సి ఉంటుందంటున్నారు. జిల్లా దాటితే టిక్కెట్ తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు. అదీ కూడా రోజుకు ఒకసారి మాత్రమే ఓ మహిళ ప్రయాణం చేయడానికి వీలుంటుందని ఆ శాఖ అధికాకారులు పేర్కొంటున్నారు. ఆదాయం రాని మార్గాల్లో పల్లెవెలుగు బస్సులు ఇప్పటికే రద్దు కాగా మరికొన్ని ఎత్తివేసే పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు తిప్పలు తప్పవని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే సుమారు 200 మార్గాల్లో పల్లెవెలుగు బస్సులు నడవడం లేదు. ఉన్న సర్వీసులను ఉచిత బస్సు పథకానికి వినియోగిస్తే జిల్లాలోని ఏ గ్రామీణ ప్రాంతానికీ పల్లె వెలుగు సర్వీసులు నడిచే పరిస్థితులు ఉండవని అంటున్నారు.
ఏదైనా పథకం ప్రారంభిస్తున్నాం అంటే ఇంకెవరైనా నమ్ముతారేమో కానీ.. చంద్రబాబు అంటే మాత్రం నమ్మరు. తీసివేతలు, భాగహారాలు లేకుండా ఆయన పథకాలు ఏవీ వర్తింపజేయరని, అవన్నీ పోగా నామమాత్రపు లబ్ధిదారులు మిగులుతారని.. ఆ మిగిలించుకోవడంలో ఆయన సిద్ధహస్తులని పలువురు విశ్లేషకుల అభిప్రాయం. ఆయన సూపర్ సిక్స్ పథకాల్లో ఉచిత బస్సు పథకం కూడా అలాంటిదే. పల్లె ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని.. వారి జీవన విధానాల్లో మార్పులు రావాలని ప్రయాణ సమస్యలు తీర్చాలని ఏర్పాటు చేసిన పల్లె వెలుగు బస్సుల లక్ష్యాన్ని నీరుగార్చేసింది చాలక.. అరిగిపోయిన.. మరమ్మతులకు నోచుకోని ఈసురోమంటూ నడిచే ఆ వాహనాలను మహిళలకు ఉచిత బస్సు పథకానికి వినియోగించనున్నట్టు తెలుస్తోంది. ప్రతి శివారు పల్లెకు బస్సు సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆ బస్సులను ఇప్పటికే చాలా వరకు ఆక్యుపెన్సీ రేటు లేదని తగ్గించేశారు. మిగిలిన బస్సులను ఉచిత బస్సు పథకానికి వినియోగించనున్నట్టు తెలుస్తోంది. మరి ఉన్న అరకొర బస్సులతో లక్షలాది మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఎలా అమలు చేస్తారో.. ఈ పథకానికి ఎన్ని గొళ్లేలు పెట్టనున్నారో.. ఎంత మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుందో చూడాలి.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు మాటల గారడీతో మరోసారి మహిళలు మోసపోయారు. సార్వత్రిక ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీ నమ్మి దగా పడ్డ మహి ళాలోకం తిరగబడే రోజులు దగ్గరపడ్డాయి. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చంద్రబా బుతో పాటు కూటమి నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చంద్రబాబు గద్దె నెక్కి ఏడాదైనప్పటికీ సూప ర్ సిక్స్‌లో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేసింది లే దు. తల్లికి వందనం పేరు చెప్పి అర్హులైన వేలాది మంది తల్లులు ఇప్పటికీ సచివాలయాలు, విద్యుత్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15న ఆర్టీసీలో అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించగానే మహిళలు ఎగిరి గంతేశారని చెప్పొచ్చు. మరో పక్షం రోజులు ఆగితే ఏ ఊరు వెళ్లాలన్నా ఆర్టీసీలో ప్రయాణం ఉచితమే అనుకుని సంబరపడ్డారు. తీరా ఉచిత ప్రయాణం అన్ని బస్సుల్లో అమలుచేయడం లేదని తెలిసి చంద్రబాబు మోసంపై మహిళలు నిప్పులు చెరుగుతు న్నారు. ఉచిత ప్రయాణం పల్లె వెలుగులకే పరిమితమంటుంటే మహిళల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఉచిత బస్సు పథకం ఉత్తుత్తి బస్సుగా మారుతుందని మహిళలు చంద్రబాబుకు శాపనార్థాలు పెడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రంగా ఉంది. ఫలితంగా 200 గ్రామాలకు పైనే ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. పల్లెలకే కాకుండా పుణ్యక్షేత్రాలకు సరిపడా బస్సులు ఉండటం లేదు.
కొత్త బస్సుల ఊసేదీ?
కాకినాడ జిల్లాలో పల్లె వెలుగు 125, అల్ట్రా పల్లె వెలుగు సర్వీ సులు 39 మాత్రమే ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్ సర్వీసులు 19 వరకు నడుస్తున్నాయి. జిల్లాలో 12 లక్షల మంది మహిళలు ఉన్నారని అంచనా. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకారం చూసుకుంటే 12 లక్షల మందికి అవసరమైన సర్వీసులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో అన్ని సర్వీసులు ఆర్టీసీకి లేవు. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా ఉచిత బస్సు ప్రయాణం అమలుచేయాలంటే జిల్లాలో తక్కువలో తక్కువ అదనంగా వంద బస్సులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇన్ని బస్సులు ఒకేసారి నిర్వహించాలంటే ఇప్పుడున్న సిబ్బంది సంఖ్యను మరింత పెంచాల్సి ఉంటుంది. 100 మంది డ్రైవర్లు, 100 మంది కండక్టర్లు అవసరమవుతారని చెబుతున్నారు. ఇప్పుడు నడుస్తున్న బస్సులతోనే సర్దుబాటు చేయడం ఎంత మాత్రం వీలుకాదని ఆర్టీసీ అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్న పల్లెవెలుగు సర్వీసులను ఉచిత బస్సుల కోసం ప్రధాన ప్రాంతాల్లో నిర్వహిస్తే పల్లెల్లో బస్సు సర్వీసుల పరిస్థితి ఏమిటో అర్థంకావడం లేదని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కొత్త సర్వీసుల ఊసేలేదు. పాడైన కొన్ని సర్వీసులను మాత్రమే కొత్త బస్సులుగా మార్చారని తెలిసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి డిపోకు కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని తేదేపా నేతలు చెప్పి మాటలు నీటిమీద రాతలుగానే మిగిలాయి. కాకినాడ సిటీలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడతామని చెప్పిన మాటలు ఏమయ్యాయని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఏలేశ్వరం, తుని, కాకినాడ ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. కొత్త బస్సులను ఏర్పాటు చేయకుండా ఉన్న పల్లెవెలుగు బస్సులను ఉచిత బస్సు పథకం కోసం వినియోగిస్తే మిగిలిన సర్వీసుల పరిస్థితి డోలాయమానంలో పడుతుందని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
కొన్నింటిలోనే ఉచితం
ఉచితం అన్ని బస్సుల్లో కాదని.. కొన్నింటిలో మాత్రమే ఉంటుందని ఆర్టీసీ అధికారులకు ఉన్నతాధికారుల నుంచి సమాచారం వచ్చింది. ఎన్నికల సమయంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ ఆర్భాటంగా ప్రకటించారు. ఇప్పుడు చూస్తే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు మాత్రమే ఉచితంగా మహిళలు ప్రణించడానికి అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. ఉచిత బస్సు పథకం అమలుచేయడం పల్లెవెలుగు సర్వీసులపైనే ఆధారపడుతుందంటున్నారు.
పల్లె వెలుగుతోనే ఉచిత ప్రయాణం అయినా మరో 100 సర్వీసుల అవసరం
12 లక్షల మంది మహిళల ఎదురుచూపు బాబు మార్క్ మరో మోసం
జిల్లా ఆర్టీసీ సమాచారం
ఏలేశ్వరం 39
కాకినాడ 79
తుని 57
మొత్తం డిపోలు 3
మొత్తం బస్సులు 175
మార్గదర్శకాల కోసం నిరీక్షిస్తున్నాం
ఇంత వరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై జిల్లా స్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఉన్నతాధికారుల నుంచి వచ్చే మార్గదర్శకాల ప్రకారం ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా కాకినాడ, తుని, ఏలేశ్వరం డిపోల పరిధిలో ఉన్న బస్సులనే ఎలా సర్దుబాటు చేయాలనేది అంచనా వేస్తున్నాం.
– ఏ శ్రీనివాసరావు,
జిల్లా ప్రజారవాణా అధికారి, కాకినాడ
అన్ని బస్సుల్లోనూ అనుమతించాలి
ఆర్టీసీలో మహిళలకు ఉచిత బ స్సు ప్రయాణం ఎంతవరకు అమ లు చేస్తారో వేచి చూడాల్సిందే. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం చూసుకుంటే ఆర్టీ సీ నిర్వహించే అన్ని రకాల బస్సుల్లోను ఉచిత ప్ర యాణం కోసం మహిళలను అనుమతించాలి. కానీ అలా అమలు చేస్తారని నమ్మకం కలగడం లేదు. ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలుచేయక పోవడంతో ఈ అభిప్రాయానికి రావాల్సి వ స్తోంది. ఏదో మొక్కుబడిగా అమలు చేసి చేతులు దులిపేసుకుంటారనే అనుమానం కలుగుతోంది.
– వర్ధినీడి సుజాత, అధ్యక్షురాలు, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం, కాకినాడ జిల్లా

ఉచితం.. బుసు్స!

ఉచితం.. బుసు్స!