
స్మార్త ఆగమ విద్యార్థులకు అస్వస్థత
బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రత
తగ్గుతున్న వరద గోదారి
ఐ.పోలవరం: గోదావరి క్రమేపీ శాంతిస్తోంది. వరద నెమ్మది నెమ్మదిగా తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజీకి వరద జలాల రాక తగ్గుతోంది. దీనితో బుధవారం ఉదయం ఆరు గంటల సమయానికి దిగువునకు 5,86,477 క్యూసెక్కులు విడుదల చేయగా, సాయంత్రం ఆరు గంటల సమయానికి 5,14,177 క్యూసెక్కులకు తగ్గింది. గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతానికి 4,71,927 క్యూసెక్కులకు వరద తగ్గింది. అయితే బ్యారేజీ వద్ద ఉధృతి తగ్గినా దిగువున లంక గ్రామాలను వరద వీడలేదు. ఐ.పోలవరం మండలం అన్నంపల్లి, పి.గన్నవరం అక్విడెక్టులను తాకుతూ ఇంకా వరద నీరు ప్రవహిస్తోంది. గోదావరికి జూలై నెలలో రెండవ సారి వచ్చిన వరద కూడా స్వల్పంగానే ప్రభావం చూపించడంతో లంక వాసులు ఊపిరిపీల్చుకున్నారు.
సగటున పది మిల్లీమీటర్ల వర్షం
జిల్లాలో బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 10 మిల్లీమీటర్లు వర్షం పడగా, అత్యధికంగా పి.గన్నవరం మండలంలో 36.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా మలికిపురం మండలంలో ఒక మిల్లీమీటర్ కురిసింది. అంబాజీపేటలో 30.8, అమలాపురంలో 25.2, ముమ్మిడివరంలో 20.4, ఐ.పోలవరంలో 16.4, మామిడికుదురులో 16.2, అల్లవరంలో 12.8, ఉప్పలగుప్తంలో 11.8, రాజోలులో 10, అయినవిల్లిలో 9.6, కాట్రేనికోనలో 9.2, మండపేటలో 6.2, కొత్తపేటలో 5, కె.గంగవరంలో 4.2, ఆత్రేయపురంలో 3.6 మిల్లీ మీటర్లు నమోదైంది.
● తుని ప్రభుత్వ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స
● నిలకడగా విద్యార్థుల
ఆరోగ్యం : డీఎంహెచ్‌ఓ
అన్నవరం: సత్యగిరిపై నిర్వహిస్తున్న సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు ఎనిమిది మంది గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని రాత్రి తుని ప్రభుత్వాస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కొండదిగువన ఆరెంపూడి సత్రంలో దత్తపీఠం ఆధ్వర్యంలో జరిగిన యాగంలో వారు నాలుగు రోజులుగా పాల్గొని అక్కడే భోజనాలు చేశారు. వారిలో స్వరూప్, సత్యయశ్వంత్, సాయి స్వరూప్, సుధాకర్, ఫణీంద్ర కుమార్, కార్తిక్, సాయి గణేష్, సాత్విక్‌లకు బుధవారం నుంచి వాంతులు, విరేచనాలు అవుతుండడంతో స్థానిక దేవస్థానం ఆసుపత్రిలో వైద్యం అందించారు. గురువారం పరిస్థితి విషమించడంతో వారిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న డీఎంహెచ్‌ఓ నర్శింహనాయక్ విద్యార్థులను పరామర్శించి అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని ఆందోళన అవసరం లేదన్నారు. దేవస్థానం ఏఈఓ పెండ్యాల భాస్కర్ ఆసుపత్రిలోనే ఉండి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
రాజమహేంద్రవరం రూరల్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడెన్స్ ప్రకారం బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిర్దేశిత భద్రతా ప్రమాణాలు తప్పక పాటించాలని ఎస్పీ డి.నరసింహకిషోర్ ఆదేశించారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని వివిధ బ్యాంకు అధికారులు, సెక్యూరిటీఅధికారులతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన సమావేశం నిర్వహించారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద నేర నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రత పరంగా తీసుకోవలసిన చర్యల గురించి పి.పి.టి. ద్వారా జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ వివరించి సూచనలు చేశారు. బ్యాంకు విధుల్లో నియమించుకునే తాత్కాలిక సిబ్బంది, అవుట్ సోర్సింగ్ భద్రతా సిబ్బందికి ముందుగా పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించాలన్నారు. ప్రతి బ్యాంకు, ఏటీఎం వద్ద 24 గంటలూ పనిచేసే నైట్ విజన్ ఏఈ సీసీటీవీలను అమర్చుకోవాలన్నారు. ఏదైనా అనుకోని ఘటన జరిగినప్పుడు బ్యాంకు అధికారులకు కాల్ చేసే సౌకర్యంతో కూడిన భద్రతా అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సెక్యూరిటీ, ఫైర్ సెక్యూరిటీ పరికరాల పనితీరును క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. విడిగా ఉన్న ఏటీఎంలు, బ్యాంకుల వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలన్నారు. బ్యాంకు సిబ్బంది పోలీసు సిబ్బందితో సంబంధాలు ఏర్పరుచుకోవాలని, అత్యవసర సమయాలలో సంప్రదించడానికి వీలుగా పోలీసు అధికారుల కాంటాక్ట్ డీటెయిల్స్ కలిగి ఉండాలని తెలిపారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన సర్వెలెనన్స్ రిపోర్టును సంబంధిత స్టేషన్‌కు విధిగా పంపాలన్నారు.

స్మార్త ఆగమ విద్యార్థులకు అస్వస్థత

స్మార్త ఆగమ విద్యార్థులకు అస్వస్థత

స్మార్త ఆగమ విద్యార్థులకు అస్వస్థత