భక్తిశ్రద్ధలతో పవిత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో పవిత్రోత్సవాలు

Aug 27 2026 12:54 AM | Updated on Aug 27 2026 12:54 AM

ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో బుధవారం పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం సుప్రభాతసేవ, విశేష తిరువారాధన, సన్నాయి వాయిద్యాల నడుమ పవిత్రమాలలతో గ్రామోత్సవం, యాగశాల ద్వారా తోరణ, ధ్వజకుంభారాధన, మహాకుంభ ఆరాధనలు, పవిత్ర ప్రతిష్ఠ, మూలమంత్ర హోమాలు, పవిత్ర ఆదివాస హోమాలు, లఘు పూర్ణాహుతి, మహానైవేద్య నీరాజనములు, తీర్థ ప్రసాదగోష్టి వంటి పూజలు చేశారు. అదేవిధంగా సాయంత్రం దివ్యప్రభంద పారాయణం, యాగశాల ఆరాధన, నిత్యహోమం, శ్రీరామ మూలమంత్ర గాయత్రీ హోమం, లఘు పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్టి వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్‌ సురేందర్‌ రాజు, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు, పాల్గొన్నారు.

సెలవులో రేడియాలజిస్టు.. ఇబ్బందుల్లో రోగులు

గద్వాల క్రైం: జిల్లా ఆస్పత్రిలోని రేడియాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న రేడియాలజిస్టు వ్యక్తిగత సెలవులపై వెళ్లడంతో రోగులు ఇబ్బందులు పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ప్రత్యామ్నాయ్య చర్యలు తీసుకోవాల్సిన అధికారులు విఫలమయ్యారని బాధితులు పేర్కొన్నారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గద్వాల మండలం కొండపల్లికి చెందిన ఆశా కార్యకార్త దేవమ్మకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యులు స్కానింగ్‌ చేయాల్సిందిగా సూచించారు. బాధితురాలిని ఆమె భర్త ఆస్పత్రిలోని స్కానింగ్‌ విభాగం వద్దకు తీసుకెళ్లాడు. అయితే సదరు సిబ్బంది సెలవుల్లో ఉండడంతో స్కానింగ్‌ చేసేందుకు సమస్యగా ఉందని వైద్యుల దృష్టికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్‌లో స్కానింగ్‌ చేయించూకోవాలని సూచించారు. ప్రైవేటులో చూయించుకునే ఆర్థిక స్థోమత లేదని భర్త వైద్యులను వేడుకున్నాడు. కానీ స్కానింగ్‌ రిపోర్టు ఉంటేనే చికిత్స చేస్తామని వైద్యులు తెగేసి చెప్పారు. లేకపోతే కర్నూల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా ఉచిత సలహ ఇచ్చారు. దీంతో బాధితురాలి భర్త తనకు ఎదురైన సమస్యను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఘటనపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందజేయాల్సిందిగా కోరాడు. ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ‘సాక్షి’ వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.

కలుపు బెడద.. కూలీల కొరత

రైతన్నలపై అదనపు భారం

రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement