అర్హులందరికీ సంక్షేమ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

Aug 27 2026 12:54 AM | Updated on Aug 27 2026 12:54 AM

కేటీదొడ్డి/ధరూరు: పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం చేపట్టిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం కేటీదొడ్డి మండలంలోని పాతపాలెం, వెంకటాపురం, చింతలకుంటలో, ధరూరు మండలంలోని మన్నాపురంలో కాంతమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ గృహ ప్రవేశాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా దంపతులకు నూతన వస్త్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పి పేదలను నిలువునా మోసం చేసిందని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్లు మంజూరు కాగా.. ఇప్పటికే 2 వేల ఇళ్లకు పైగా నిర్మాణాలు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజారెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌, మాజీ సర్పంచులు శ్రీనివాస్‌రెడ్డి, ఆంజనేయులు, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్‌, వెంకన్‌గౌడ్‌, కృష్ణ, గోపి, మాజీ కో ఆప్షన్‌ సభ్యుడు దర్శెల్లి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement