బలవంతుడికి చట్టం చుట్టమేనా..? | - | Sakshi
Sakshi News home page

బలవంతుడికి చట్టం చుట్టమేనా..?

Aug 26 2026 1:00 AM | Updated on Aug 26 2026 1:00 AM

ఓ కుటుంబంలో సంపాదించే పెద్ద మరణిస్తే కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలి రోడ్డున పడుతుంది. కుటుంబ పోషణ, పిల్లల చదువు, భవిష్యత్‌కు భరోసా వంటివి ఆ కుటుంబాన్ని వెంటాడుతుంటాయి. ఇలాంటి బలహీన సమయంలో నేరానికి పాల్పడిన వారు తమకున్న ధన బలం, రాజకీయ ప్రాబల్యంతో డబ్బులు వెదజల్లుతూ చట్టానికి దొరకకుండా సులువుగా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో బలహీనుడి పట్ల కఠినంగా వ్యవహరించే చట్టం కాస్త బలవంతుడి ముందు మోకరిల్లుతుందనే ఆందోళన న్యాయనిపుణుల నుంచి వ్యక్తమవుతోంది.

● నేరాలు జరిగినప్పుడు చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన సదరు అధికారులు వారిపై వచ్చే వివిధ రకాల ఒత్తిళ్లకు తలొగ్గి చట్టాలను సరిగా అమలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ఘటనలలో ఏకంగా సదరు అధికారులే మధ్యవర్తిత్వం నెరిపి.. రాజీ వ్యవహారం చేస్తున్నారనే ప్రచారం ఉంది. దీంతో నేరం చేసిన బలవంతుడు డబ్బు ఇచ్చాం.. కేసు లేదు అనే అహంకార ధోరణితో వ్యవహరిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement