జోగుళాంబ గద్వాల | - | Sakshi
Sakshi News home page

జోగుళాంబ గద్వాల

Aug 26 2026 1:00 AM | Updated on Aug 26 2026 1:00 AM

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2026

ప్రాణం ఖరీదు

గద్వాల: నడిగడ్డ ప్రాంతంలో ప్రాణానికి ఖరీదు కడుతూ తమకున్న రాజకీయ పలుకుబడితో సెటిల్‌మెంట్లు చేసి చట్టానికి దొరకకుండా తప్పించుకుంటున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చేసిన నేరానికి చట్టం ముందు జవాబు చెప్పాల్సిన దోషులు.. బాధిత కుటుంబానికి నగదు చెల్లింపులు చేస్తూ.. కేసులు లేకుండా దర్జాగా కాలరెగరేస్తూ బయట తిరుగుతున్నారు. దీంతో చట్టాన్ని అమలు చేసే పోలీసు శాఖ, న్యాయ వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుంది. గద్వాల జిల్లాకేంద్రంలో ఇటీవలి వరుసగా జరుగుతున్న ప్రమాదాలు, అనుమానాస్పద మరణాలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో మరణాలు, కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య వంటి కొన్ని ఘటనలలో చోటుచేసుకున్న సెటిల్‌మెంట్ల పర్వం ఇలాంటి ఆందోళననే రేకెత్తిస్తున్నాయి.

నేరం చేసి సెటిల్‌మెంట్లతో తప్పించుకుంటున్న నిందితులు

నడిగడ్డలో చక్రం తిప్పుతున్న రాజకీయ నేతలు, మధ్యవర్తులు

విద్యార్థి ఆత్మహత్య.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికి ఇదే పద్ధతి

ఒత్తిళ్లకు తలొగ్గి చట్టాన్ని తుంగలో తొక్కుతున్న అధికారులు

జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న వరుస పరిణామాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement