పంటల వైవిద్ధీకరణపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

పంటల వైవిద్ధీకరణపై ప్రత్యేక దృష్టి

Aug 25 2026 12:51 AM | Updated on Aug 25 2026 12:51 AM

గద్వాల: ప్రధానమంత్రి ధన్‌ ధాన్య కృషి యోజన అమలులో జిల్లా 27వ స్థానంలో ఉందని అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి వ్యవసాయ శాఖ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రమోహన్‌ నిర్వహించిన వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి విషయంలో ప్రస్తుతం ఉన్న మౌళిక వసతులు సృష్టించిన సాగునీటి సామర్థ్యం వినియోగం పెండింగ్‌ పనులు మైక్రో ఇరిగేషన్‌ డ్రిప్‌, స్ప్రింక్లర్‌ అవసరాలు, అదనపు నిధుల ఆవశ్యకతను గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. పీఎండీడీకేవై అమలులో సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో శిక్షణ డీసీ రాజ్‌కుమార్‌, డీఏఓ వీరప్ప తదితరులు పాల్గొన్నారు.

ఉచిత కంటి పరీక్షలు

గద్వాల: పేదలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన కంటిఅద్దాలు, ఆపరేషన్లు చేయించనన్నట్లు లయన్స్‌ క్లబ్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య తెలిపారు. సోమవారం రామిరెడ్డి కంటి ఆస్పత్రి, జిల్లా లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మండలంలోని సంగాలలో 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించి.. 30 మందికి కంటిఅద్దాలు పంపిణీ చేశారు. అలాగే కంటి సమస్య అధికంగా ఉన్న 25 మందిని ఆపరేషన్ల కోసం ఏనుగొండలో రామిరెడ్డి కంటి ఆస్పత్రిలో మంగళవారం ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ నళిని, శ్రీహరి, తాయన్న, అయ్యపురెడ్డి, మోహన్‌రావు, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

యాప్‌లో వివరాలు నమోదు తప్పనిసరి

గద్వాల: జిల్లాలో ఏడు సన్నరకాల వరి విత్తనాలను కొనుగోలు చేసిన రైతుల వివరాలను సంబంధిత విత్తన డీలర్లు తప్పనిసరిగా విత్తన సేల్స్‌ యాప్‌లో నమోదు చేయాలని డీఏఓ వీరప్ప సోమవారం ప్రకటనలో తెలిపారు. రైతులు బాధ్యతగా వివరాలను యాప్‌లో నమోదు చేయాలన్నారు. యాప్‌లో వివరాలు నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం అందించే రూ.500 బోనస్‌ అందుతుందన్నారు. సెప్టెంబర్‌ 10లోగా రైతులందరూ తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు.

నేటినుంచి

పవిత్రోత్సవాలు

ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్‌ సురేందర్‌రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విశ్వక్సేన ఆరాదన, పుణ్యాహవచనం, అంకురార్పణ, తీర్థగోష్టి, బుధవారం మంగళవాయిద్యాల నడుమ పవిత్ర గ్రామ ప్రదక్షిణ, వేద ప్రబంధ పారాయణం, యాగశాల ఆరాదన, హోమం, తీర్థ గోష్టి, గురువారం వేద పారాయణం, యాగశాల ఆరాదన, పవిత్ర సమర్పనం, లఘు పూర్ణాహుతి, శుక్రవారం వేద పారాయణం, యాగశాల ఆరాదన, మూలమంత్ర హోమాలు, చక్రస్నానం, మహా పూర్ణాహుతి, మహానైవేద్యం, నీరాజనం, తీర్థగోష్టి, శ్రీలక్ష్మీ హయగ్రీవ స్వామి తిరుకల్యాణం, ఉత్సవ పరిసమాప్తి, వేద ఆశీర్వచనం వంటి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నట్లు వెల్లడించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement