రాజాపూర్: ఆధునిక, సాంకేతిక శిక్షణతో యువత భవిష్యత్‌కు రంగారెడ్డిగూడ గ్రామంలో నిర్మించబోతున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) బలమైన పునాది అవుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట్‌స్వామి అన్నారు. గురువారం రాజాపూర్ మండల రంగారెడ్డిగూడలో రూ.42 కోట్ల నిధులతో ఏటీసీ సెంటర్‌కు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ యువతకు విద్యా, ఉద్యోగవకాశాలను అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పరని. అందులో భాగంగా తొలివిడతలో రూ.2 వేల కోట్లతో 55 ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల పాలుజేసి అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ పార్టీ.. నేడు ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేస్తలేరని చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు.
730 క్వింటాళ్ల వేరుశనగ రాక
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవ సాయ యార్డుకు గురువారం 730 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ.7,399, కనిష్టంగా రూ.4,341, సరాసరిగా రూ.6,520 ధరలు లభించాయి.
రీ–టెండర్ నిర్వహించాలి
గద్వాల: గద్వాల మున్సిపాలిటీ పరిధిలో వెజ్, నాన్ వెజ్ షాపులకు నిర్వహించిన టెండర్ ప్రక్రియలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని తిరిగి రీ–టెండర్ నిర్వహించాలని బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం 38 షాపులకు టెండర్ నిర్వహించగా, ఇందులో 15 షాపులను ఎస్సీ, ఎస్టీలకు, మరో 23 షాపులకు జనరల్‌కు కేటాయించారన్నారు. ఇందుకు సంబంధించి 118 దరఖాస్తులు రాగా.. మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి వివిధ కారణాలు చూపెడుతూ మొత్తం 59 దరఖాస్తులను తిరస్కరించారని ఆరోపించారు. ఫలితంగా ఎలాంటి పోటీ లేకుండానే వేలం జరిగి మున్సిపల్ ఆదాయానికి భారీగా గండిపడిందని, అలాగే షాపు నంబర్లు 1, 30లకు వేలం నిర్వహించలేదని విమర్శించారు. ఈ షాపులకు ఎప్పుడు వేలం నిర్వహిస్తారో స్పష్టం చేయలేదని, వేలం నిర్వహించి ఆరు రోజులు గడిచినా ఏయే షాపులు ఎంతెంత వేలం పోయాయి.. ఎవరికి కేటాయించారు.. అనే వివరాలు చెప్పలేదన్నారు. ఇంకా ఎన్నో సందేహాలు, అక్రమాలు చోటుచేసుకున్నప్పుడు తిరిగి షాపులకు రీటెండర్ నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కిరణ్, హన్మంతు, వెంకటేష్, రాము, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమ ప్రాజెక్టులు ఆపాలి
గద్వాల: తుంగభద్ర నదిపై ఆర్‌డీఎస్‌కు తూట్లు పొడుస్తూ కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న కురిడి లి్‌ఫ్ట్ ఇరిగేషన్‌ను తక్షణమే ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల నీటిని ఎన్నడూ వినియోగించుకోలేదన్నారు. కేవలం 25 వేల ఎకరాలకు మించి సాగునీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న కురిడి ప్రాజెక్టును తక్షణమే ఆపాలని, ఆర్డీఎస్ రావాల్సిన నీటి వాటాను పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎకై ్సజ్ డీసీగా
విజయ్‌భాస్కర్‌రెడ్డి
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో అబ్కా రీ శాఖలో ఉన్నతాధికారులకు స్థానచలనం జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌గా ఉంటూ ఇన్‌చార్జి డీసీగా ఉన్న విజయ్‌భాస్కర్‌రెడ్డిని ఇక్కడే ఉమ్మడి జిల్లా రెగ్యులర్‌గా డిప్యూటీ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఖాళీ అయిన ఆ స్థానానికి హైదరాబాద్ నుంచి జి.శ్రీనివాస్ బదిలీపై ఉమ్మడి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్‌గా వచ్చారు. నాగర్‌కర్నూల్ ఈఎస్‌గా పని చేస్తున్న గాయత్రి మెదక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో నాగర్‌కర్నూల్ ఈఎస్‌గా వి.వేణుగోపాల్‌రెడ్డి ఖమ్మం నుంచి పదోన్నతిపై వచ్చా రు. భూపాలపల్లి నుంచి వనపర్తి ఈఎస్‌గా ఎం.లింగచారి, కొత్తగూడెం ఏఈఎస్‌గా ఉన్న పి.కరమ్‌చంద్ పదోన్నతిపై గద్వాల ఈఎస్‌గా వచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఏఈఎస్‌గా ఉన్న నర్సింహారెడ్డి పదోన్నతిపై మెదక్ ఈఎస్‌గా వెళ్లారు.


