సమగ్ర ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి | - | Sakshi
Sakshi News home page

సమగ్ర ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి

Jun 26 2026 4:11 AM | Updated on Jun 26 2026 4:11 AM

విజయవంతం చేయాలి..

సర్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలని అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో 217, 218 పోలింగ్‌ వద్ద సర్‌లో భాగంగా ఇంటింటికి ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేస్తున్న బీఎల్‌ఓల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి.. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రాముఖ్యతను వివరించారు. ప్రజల సహకారంతోనే సమగ్ర విశ్వసనీయ ఓటరు జాబితా రూపకల్పన సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజలందరూ ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణలో చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

గద్వాల: ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియతో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఓటరు జాబితాను రూపొందించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషాషేక్‌ అన్నారు. సర్‌పై ఓటర్లకు కల్పించేందుకు గురువారం కలెక్టరేట్‌ నుంచి కృష్ణవేణిచౌరస్తా వరకు నిర్వహించిన 2కే రన్‌ను కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. అధికారులు, విద్యార్థులు, ఓటర్లు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని ఓటరు చైతన్యానికి సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఓటరు చైతన్య నినాదాలు చేస్తూ ఉత్సాహంతో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్‌ను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. మరణించిన వారు, అనర్హుల ఓట్లు తొలగించి ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు ఎస్‌ఐఆర్‌ ప్రక్రయ దోహదపడుతుందన్నారు. ఈనెల 26వ తేదీన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సం పురస్కరించుకుని వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు మధుమోహన్‌, నర్సింగ్‌రావు, ఏఎస్పీ శంకర్‌, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏఓ భూపాల్‌రెడ్డి, శిక్షణ డీసీలు మనోజ్‌కుమార్‌రెడ్డి, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement