ఉమ్మడి జిల్లాలో.. | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాలో..

Jun 26 2026 4:11 AM | Updated on Jun 26 2026 4:11 AM

కృష్ణాబేసిన్‌ పరిధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 2 లక్షలు, భీమా కింద 2 లక్షలు, కల్వకుర్తి కింద 3.65 లక్షలు, కోయిల్‌సాగర్‌ కింద 30 వేలు, జూరాల కింద 1.09 లక్షల ఎకరాలు కలుపుకొని మొత్తం సుమారు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికింద ప్రతిఏటా వానాకాలంలో సుమారు 6.50 – 7 లక్షల ఎకరాలు వరకు సాగవుతుంది.

రబీలోనే కష్టాలు..

వానాకాలంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పారుతున్నప్పటికీ రబీ సీజన్‌లో మాత్రం అన్ని ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటి కష్టాలు ఎదురవుతాయి. ఇటీవల కాలంలో ఏకంగా ప్రాజెక్టుల కింద క్రాప్‌ హాలిడే సైతం ప్రకటించే పరిస్థితి నెలకొంది. జూరాల ఎడమ కాల్వ పరిధిలో క్రాప్‌ హాలిడే ప్రకటించగా.. కుడి కాల్వ పరిధిలో ఆయకట్టు సగానికి కుదించేయడం చూస్తే సాగునీటి కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement