డ్రగ్స్‌.. వ్యక్తికే కాదు కుటుంబానికి ముప్పు | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌.. వ్యక్తికే కాదు కుటుంబానికి ముప్పు

Jun 25 2026 1:12 AM | Updated on Jun 25 2026 1:12 AM

గద్వాల క్రైం: మత్తు పదార్థాలకు బానిసలైన వ్యక్తులకు కౌన్సెలింగ్‌ ద్వారా పునరావాస కార్యాక్రమాలను అందజేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ‘మన డ్రగ్స్‌ డీ అడిక్షన్‌ – రిహాబిటేషన్‌ సెంటర్‌’ను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తులను మాత్రమే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయన్నా రు. వ్యసనాలకు బానిసైలన వారికి సరైన సమయంలో చికిత్స, కౌన్సెలింగ్‌, యోగా, ధ్యానం వంటి శిక్షణ ఇవ్వాలన్నారు. సెంటర్‌లో ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, సదుపాయాలను సొసైటీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈగల్‌ ఫోర్స్‌ ద్వారా జిల్లాకు వచ్చిన క్యారమ్‌, చెస్‌, పెయింటింగ్‌ బోర్డు, సృజనాత్మక కార్యకాలపాలకు ఉపయోగపడే సామగ్రిని అందజేశారు. కార్యక్రమాంలో సీఐ శ్రీను, ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్‌, సెంటర్‌ నిర్వాహకులు కృష్ణయ్య తదితరులు ఉన్నారు.

పనులు నాణ్యతగా చేపట్టాలి

ఉండవెల్లి: మండలంలోని 11 పంచాయతీల్లో చేపడుతున్న నీటి సంరక్షణ పనుల్లో భాగంగా జల్‌ సంచయ్‌ జన్‌ భగీదారి కార్యక్రమంలో భాగంగా 31 పనుల్లో 28 పనులను కేంద్ర నోడల్‌ అధికారి సత్యమూర్తి, జిల్లా టెక్నికల్‌ కోఆర్డినేటర్‌ విద్యాధర్‌, ఏపీడీ శ్రీనివాసులు పరిశీలించారు. గ్రామ పంచాయతీల్లో ఇంకుడు గుంతలు, చెక్‌డ్యాములు, బోరు బావులు, రూప్‌టాప్‌ హర్వెస్టింగ్‌ పనులను తనిఖీ చేశారు. పనుల్లో నాణ్యత లోపిస్తే వెంటనే వాటికి మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పనులను త్వరగా పూర్తి చేయించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ తిరుపతన్న, ఏపీఓ సౌజన్య, టీఏలు రామచంద్రుడు, విజయ్‌ పాల్గొన్నారు.

లంపిస్కిన్‌ నివారణ టీకాలు వేయించండి

గద్వాల వ్యవసాయం: గోజాతి పశువులైన ఎద్దు లు, ఆవులు, కోడెలు లంపిస్కిన్‌ (ముద్ద చర్మం) వ్యాధి బారిన పడకుండా ముందుస్తుగా నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశువైద్య, పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌ వెంకటనారాయణ ఒక ప్రకటనలో పాడి రైతులకు సూ చించారు. బుధవారం నుంచి ఈ కార్యక్రమం జిల్లాలో ప్రారంభమైందన్నారు. జూలై 8 వరకు ఆయా గ్రామాల్లో పశువైద్య సిబ్బంది పశువులకు టీకాలు వేస్తారని పేర్కొన్నారు. 2 నుంచి 3 నెలల దూడలు కూడా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందన్నారు. దోమలు, ఈగ లు, రక్తం పీల్చే కీటకాల ద్వార, వ్యాధి సోకిన పశువుల నీరు, మేత ద్వారా కూడా వ్యాధి సంక్రమిస్తుందని తెలిపారు. అధిక జ్వరం, కళ్లు, ముక్కు నుంచి నీరుకారడం ఈ వ్యాధి లక్షణాలుగా పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement