ధరూరు: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి గెలుపునకు పునాది రాయి లాంటిదని తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ కార్పొరేషన్ చైర్మన్ సరిత అన్నారు. మండలంలోని గార్లపాడులో పోలమ్మ అవ్వ పండుగను పురస్కరించుకొని మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగాయి. సరిత పోలమ్మ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. విజేతగా నిలిచిన మూలమళ్ల జట్టుకు ప్రథమ బహుమతి రూ.30,116 నగదును మాజీ జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వరరెడ్డి దంపతులు అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన హైదరాబద్ జట్టుకు సర్పంచు పరిమళ శివరాజ్ రూ.20,016 నగదు అందజేశారు. మూడో విజేతగా నిలిచిన ప్రకాశం జిల్లా జట్టుకు రూ.15,016 నగదును శివకుమార్‌రెడ్డి అందజేశారు. అలాగే నాల్గోవ స్థానంలో నిలిచిన గార్లపాడు జట్టుకు రంగస్వామి నగదు ఆందజేశారు.
ఉత్సాహంగా సందెరాళ్ల పోటీలు..
గార్లపాడులో నిర్వహించిన సందెరాళ్ల పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతులతో పాటు షీల్డులను సర్పంచు పరిమళ శివరాజ్ అందజేశారు.


