అనేక కారణాల వల్ల ట్యాంక్ బండ్ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ట్యాంక్ బండ్‌పై రోడ్డు నిర్మించాల్సి ఉంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్స్, బెంచీలు ఏర్పాటు చేయాలి. అలుగును కాంక్రీట్ చేయాలి. ఫీడర్ చానల్‌ను అభివృద్ధి చేయాలి. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. త్వరలో నిర్మాణం పూర్తి చేసేందుకు కృషిచేస్తాం.
– నాగరాజు, ఇరిగేషన్ డీఈ
సగం కూడా పూర్తికాలే..
ట్యాంక్ బండ్ నిర్మాణం పనులు ప్రారంభించి సుమారు ఏడేళ్లవుతోంది. ఇప్పటి వరకు సగం పనులు కూడా పూర్తి కాలేదు. అధికారులు చొరువ తీసుకొని పనుల్లో వేగం పెంచాలి.
– జగన్నాథరెడ్డి, అయిజ
ఆధునిక హంగులతో నిర్మించాలి
మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూడడంతో పాటు ఆధునిక హంగులు ఏర్పాటు చేయాలి. దీంతోపాటు వాకింగ్ ట్రాక్, ఒపెన్ జిమ్ వంటివి సమకూర్చితే ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయమం చేసుకునే అవకాశం ఉంటుంది. – గోవిందు, అయిజ
●


