ఉదయం ఆరుబయట నిలబడి ఉన్నాను. అయితే ఓ కుక్క అకస్మాత్తుగా వచ్చి ఒక్కసారిగా ఎగబడి దాడి చేసింది. ఈ ఘటనలో మెడ, చేయి, కాలు ఇతర శరీర భాగాలకు తీవ్రగాయాలయ్యాయి. తప్పించునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కేకలు వేయడంతో స్థానికులు, కుటుంబ సభ్యుల వచ్చి కుక్కను తరిమేయడంతో బటయ పడ్డాను. వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా చనిపోతానేమోననే భయం వేసింది. వీధికుక్కల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలి.
– ఈశ్వర్, కుక్కకాటు బాధితుడు,
జమ్మిచేడ్‌కాలనీ, గద్వాల
ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి..
నల్లకుంట, రాజీవ్‌మా ర్గ్ కాలనీల్లోని రహదారులపై వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నా యి. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమయ్యా యి. రహదారుల వెంట పిల్లలు పాఠశాలలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో కుక్కలు దాడులకు పాల్పడే ప్రమాదం ఉంది. బైక్‌లపై వెళ్లే వారిని వెంబడించి కరుస్తున్నాయి. కుక్కలు పట్టేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆశించిన ఫలితం లేదు. కాలనీలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వాటి బెడద నుంచి కాపాడాలి.
– నందకిషోర్, నల్లకుంట కాలనీ, గద్వాల
మూడు శాఖల ఆధ్వర్యంలో..
పట్టణంలో వీధికుక్కల నియంత్రణకు ఇప్పటికే చర్యలు చేపట్టాం. వివి ధ వార్డులలో తిరుగుతున్న 60 కుక్కలను పట్టుకుని పశు సంవర్ధక శాఖ అధికారులకు అప్పగించాం. అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి కుక్కలను పట్టుకునేలా చర్యలు తీసుకుంటాం. వీలైనంత త్వరగా వాటిని కట్టడి చేస్తాం. గాయపడిన వారికి యాంటీ రేబిస్ టీకాలు, వైద్య సేవలు అందిస్తున్నాం. వైద్య, పశు సంవర్ధక, మున్సిపల్ శాఖల సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నాం. – జానకిరాంసాగర్,
మున్సిపల్ కమిషనర్, గద్వాల


