వేల సంఖ్యలో సంచారం.. | - | Sakshi
Sakshi News home page

వేల సంఖ్యలో సంచారం..

Jun 24 2026 1:11 AM | Updated on Jun 24 2026 1:11 AM

జిల్లాకేంద్రంలోని కాలనీలు, రోడ్డు మార్గంలో వెళ్తున్న వాహనదారులు, మనుషులపై వీధికుక్కలు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నాయి. దీంతో మున్సిపల్‌ అధికారులు వీధికుక్కలను నిలువరించేందుకు 8 మంది సిబ్బందిని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో శివారు ప్రాంతాలు, కాలనీలు, ప్రధాన రహదారుల వెంట తిరుగుతున్న 60 వీధికుక్కలను గుర్తించి వాటిని పశు సంవర్ధకశాఖ అధికారులకు అప్పగించారు. అయితే జిల్లాకేంద్రంలో వేల సంఖ్యలో కుక్కలు ఉన్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. వేల సంఖ్యలో కుక్కలు ఉండగా.. నామమాత్రంగా చర్యలు తీసుకుంటుండటంతో పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటం లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement