జిల్లా కేంద్రంలో పెరుగుతున్న జనాభా, నేరాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ వినూత్న చర్యలు తీసుకుంది. పట్టణ పోలీసు స్టేషన్‌లో ముగ్గురు ఎస్‌ఐలు విధులు నిర్వహిస్తుండగా.. వారికి ఒక్కో సెక్టార్‌ను కేటాయించాం. వారు నిరంతరం ఆయా సెక్టార్లపై నిఘా ఉంచి, బాధితులకు సత్వర న్యాయం చేసేలా కృషి చేస్తారు. వీరిని ఎస్‌హెచ్‌ఓ మానిటరింగ్ చేస్తూ.. అవసరమైన సలహాలు ఇస్తుంటారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లాలో నేరాల నియంత్రణకు కృషి చేస్తాం.
– మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల


