గద్వాల క్రైం: మానసిక ఒత్తిడి.. నిలకడ లేని ఆలోచనల నుంచి విజయం సాధించాలంటే యోగాతో నే సాధ్యమవుతుందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నా రు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవా న్ని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తీవ్రమైన వేదన, చిరా కు, ఒత్తిళ్లు, ఆందోళనతో కుంగిపోతున్నారన్నారు. స్థిరత్వం లేని ఆలోచనలు, క్షణికావేశంతో చేస్తున్న పొరపాట్లతో ఇబ్బందులకు గురవతున్నారని పేర్కొన్నారు. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ప్రతి రోజు యోగా చేసేందుకు కొద్ది సమయం కేటాయించాలని సూచించారు. దీంతో మానసిక ప్రశాంతత, ఆనందం, సమయానుకూలంగా తీసు కోవాల్సిన నిర్ణయాలు, చేస్తున్న పనుల్లో సంతోషం ఉంటుందన్నారు. యోగా చేసేందుకు ఎలాంటి వ యో పరిమితి లేదని, ఎవరైనా సాధన చేయొచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను, సిబ్బంది ఉన్నారు.


